బోరు బావిలో పడిన బాలుడు.. కాపాడిన రెస్క్యూ టీం..

చైనాను కొద్ది రోజులుగా వరద నీరు ముంచెత్తుతోంది. భారీ వర్షాలకు వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీగా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. కొన్ని ఇళ్లయితే నీటిలో మునిగిపోయాయి. వర్షాల కారణంగా రోడ్లు మునిగిపోవడంతో ప్రమాదవశాత్తు తూర్పు చైనాలోని జుజౌ నగరంలో ఓ బాలుడు బోరు బావిలో పడ్డాడు. స్నేహితులతో కలిసి ఆడుకుంటూ అందులో పడిపోయాడు. దీంతో అధికారులు క్రేన్ల సాయంతో బోరుబావికి సమాంతరంగా మట్టిని తవ్వి తీశారు. ఒకానొక సమయంలో బాలుడిని పైకి […]

బోరు బావిలో పడిన బాలుడు.. కాపాడిన రెస్క్యూ టీం..
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 11, 2019 | 1:03 PM

చైనాను కొద్ది రోజులుగా వరద నీరు ముంచెత్తుతోంది. భారీ వర్షాలకు వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీగా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. కొన్ని ఇళ్లయితే నీటిలో మునిగిపోయాయి. వర్షాల కారణంగా రోడ్లు మునిగిపోవడంతో ప్రమాదవశాత్తు తూర్పు చైనాలోని జుజౌ నగరంలో ఓ బాలుడు బోరు బావిలో పడ్డాడు. స్నేహితులతో కలిసి ఆడుకుంటూ అందులో పడిపోయాడు. దీంతో అధికారులు క్రేన్ల సాయంతో బోరుబావికి సమాంతరంగా మట్టిని తవ్వి తీశారు. ఒకానొక సమయంలో బాలుడిని పైకి తీసుకురావడం కష్టతరంగా మారింది. అయితే రెస్క్యూ టీం దాదాపు రెండు గంటలపాటు శ్రమించి పిల్లవాడిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. బాలుడు సురక్షితంగా ప్రాణాలతో బయటపడటంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.