‘తాండవ్’ వెబ్ సిరీస్‌ని బాయ్ కాట్ చేయండి, సైఫ్ అలీఖాన్ క్షమాపణ చెప్పాలి, బీజేపీ నేత రామ్ కదమ్ డిమాండ్

తన 'తాండవ్' వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు సైఫ్అలీఖాన్ హిందువుల సెంటిమెంట్లను గాయపరిచేలా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాడని..

  • Publish Date - 3:11 pm, Sun, 17 January 21 Edited By: Pardhasaradhi Peri
'తాండవ్' వెబ్ సిరీస్‌ని బాయ్ కాట్ చేయండి, సైఫ్ అలీఖాన్ క్షమాపణ చెప్పాలి, బీజేపీ నేత రామ్ కదమ్ డిమాండ్

తన ‘తాండవ్’ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు సైఫ్అలీఖాన్ హిందువుల సెంటిమెంట్లను గాయపరిచేలా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాడని, ఇందుకు ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత రామ్ కదమ్ డిమాండ్ చేశారు. ఈ సిరీస్ లో శివుడిని ఫన్నీగా చూపారని ఆయన ఆరోపించారు. ఈ భాగాన్ని డైరెక్టర్ అలీ అబ్బాస్ జఫర్ తొలగించాలని కోరిన రామ్ కదమ్..నటుడు జేషన్ ఆయూబ్ కూడా అపాలజీ చెప్పాలన్నారు. ఇందులో తగిన మార్పులు చేయకపోతే ఈ సిరీస్ ను బహిష్కరిస్తామన్నారు. ముంబై పోలీసులకు తాను ఫిర్యాదు కూడా చేస్తానని ఆయన చెప్పారు.

హిందూ దేవతలు, దేవుళ్లను బాలీవుడ్ ఎందుకు కించపరుస్తోందని,  చాలా కాలంగా ఇలా జరుగుతోందని రామ్ కదమ్ ఆరోపించారు. తాండవ్ సిరీస్ లో సైఫ్ అలీఖాన్ తో బాటు డింపుల్ కపాడియా, సునీల్ గ్రోవర్ తదితరులు నటించారు.

Also Read:

APSRTC Special Services: ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. తిరుగు ప్రయాణీకుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు..

త్రిపుర కాంగ్రెస్ చీఫ్ బిశ్వాస్ కారుపై దాడి, ఘటనలో స్వల్ప గాయాలు, బీజేపీ కార్యర్తల పనేనని ఆరోపణ

Accident : రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు