మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన బాలుడు

హైదరాబాద్ ఛత్రినాక పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించింది. బాత్రూంలో స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్లో నగ్నంగా వీడియోను తీసిన మైనర్ బాలుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. కొద్దిరోజుల క్రితం మహిళ స్నానం చేస్తుండగా బాలుడు రహస్యంగా వీడియో తీశాడని, ఆ వీడియోను తన స్నేహితులకు కూడా పంపాడని ఆమె ఆరోపించింది. మహిళ స్నానం చేస్తుండగా గోడచాటున ఉండి మైనర్ బాలుడు వీడియోను తీసినట్టు గమనించిన ఆమె.. ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:36 am, Tue, 19 March 19
మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన బాలుడు

హైదరాబాద్ ఛత్రినాక పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించింది. బాత్రూంలో స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్లో నగ్నంగా వీడియోను తీసిన మైనర్ బాలుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. కొద్దిరోజుల క్రితం మహిళ స్నానం చేస్తుండగా బాలుడు రహస్యంగా వీడియో తీశాడని, ఆ వీడియోను తన స్నేహితులకు కూడా పంపాడని ఆమె ఆరోపించింది. మహిళ స్నానం చేస్తుండగా గోడచాటున ఉండి మైనర్ బాలుడు వీడియోను తీసినట్టు గమనించిన ఆమె.. ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి మూడు రోజులైనా.. ఎలాంటి యాక్షన్ తీసుకోవడంలేదని సదరు మహిళ ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో స్పందించిన పోలీసులు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న కారణంగా చర్యలు తీసుకోలేదని తెలిపారు. అయితే.. ఆ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో పోలీసులు.. వెంటనే ఆ బాలుడిని అరెస్ట్ చేసి, జువైనల్ హోంకు తరలించారు.