బోట్స్‌వానా ఏనుగుల మృతి మిస్టరీ వీడింది విషతుల్యమైన నీళ్లుతాగే చనిపోయాయట!

బోట్స్‌వానాలో వందలాది ఏనుగులు చనిపోవడం వెనుక దాగున్న మిస్టరీ వీడింది.. ఎందుకు ఎలా చనిపోతున్నాయో తెలిసిపోయింది.. వరుసగా ఏనుగులు చనిపోతుండటంతో అధికారులు విచారణ చేపట్టారు..

బోట్స్‌వానా ఏనుగుల మృతి మిస్టరీ వీడింది విషతుల్యమైన నీళ్లుతాగే  చనిపోయాయట!
Follow us

|

Updated on: Sep 25, 2020 | 12:26 PM

బోట్స్‌వానాలో వందలాది ఏనుగులు చనిపోవడం వెనుక దాగున్న మిస్టరీ వీడింది.. ఎందుకు ఎలా చనిపోతున్నాయో తెలిసిపోయింది.. వరుసగా ఏనుగులు చనిపోతుండటంతో అధికారులు విచారణ చేపట్టారు.. విచారణలో తేలిందేమిటంటే నీటిలోని సైనోబాక్టీరియా ఉత్పత్తి చేసే టాక్సిన్‌ వల్లనే ఏనుగులు చనిపోయాయట! ఆ నీళ్లు తాగడం వల్లనే అంతపాటి ఏనుగులు పిట్టల్లా రాలిపోయాయట! సాధారణంగా సైనో బాక్టీరియా నీళ్లలోనూ, మట్టిలోనూ ఉంటుంది.. ఆ సూక్ష్మ జీవి వల్ల ఎలాంటి ప్రమాదం లేకపోయినా వాతావరణ మార్పుల కారణంగా విషతుల్యం అయ్యాయన్నది సైంటిస్టుల పరిశోధనలో తేలింది. మొన్న మే నెల నుంచి ఇప్పటి వరకు 330 ఏనుగులు ఇలాగే చనిపోయాయట! ఒక్క జులై నెలలోనే 281 ఏనుగులు దాహం తీర్చుకోనేందుకు వెళ్లి ప్రాణాలే పోగొట్టుకున్నాయని బోట్స్‌వానా వన్యప్రాణి, ఉద్యానవనాల డిప్యూటీ డైరెక్టర్‌ సిరిల్‌ టావోలో తెలిపారు. మండు వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రత కారణంగా సూక్ష్మజీవులు విషంగా మారాయట! ఒక్క ఏనుగులే ఎందుకు చనిపోయాయి? అవే నీటిని తాగిన మిగతా జంతువుల ప్రాణాలకు ఎందుకు ముప్పువాటిల్లలేదు? అంటే మాత్రం సైంటిస్టులు చెప్పలేకపోతున్నారు. దీనిపై విస్తృతంగా పరిశోధన జరిపితే తప్ప మిగతా జంతువులన్నీ ఎందుకు క్షేమంగా ఉన్నాయో తెలుస్తుందని అంటున్నారు. బోట్స్‌వానాలో ఏనుగులు ఎక్కువగా ఉంటాయి.. ఏనుగులు ఎక్కువగా ఉండే ఆఫ్రికాలో మూడింట ఒకవంతు ఏనుగులు బోట్స్‌వానాలోనే ఉన్నాయి. అలాగే అక్కడ ఉష్ణోగ్రతలు కూడా ఒకింత ఎక్కువే! బోట్స్‌వానా పక్కనే ఉన్న జింబాబ్వేలో ఉన్న అతిపెద్ద గేమ్‌పార్క్‌ దగ్గర సుమారు పాతిక ఏనుగులు కుప్పకూలాయి. అయితే బోట్స్‌వానా ఏనుగుల మృతికి జింబాబ్వే ఘటనకు సంబంధం లేదని అధికారులు అంటున్నారు. జింబాబ్వేలోని ఏనుగులు నీటిలోని టాక్సిన్‌ వల్ల చనిపోయినట్టు ఆధారాలు దొరకలేదన్నారు. అయితే బాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకడం వల్ల ఏనుగులు చనిపోయి ఉండవచ్చన్న అనుమానాలను వెటర్నరీ డాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు.