ప‌గ తీర్చుకోవ‌డానికి ఇచ్చిన ఆర్డ‌ర్‌లాగా ఉంది… ఇది పౌరుల హ‌క్కుల‌కు భంగం.. బాలీవుడ్ క్వీన్‌కు బాంబే హైకోర్టు ఊర‌ట..

అధికారులు ఇలా బ‌ల ప్ర‌యోగం చేయ‌డాన్ని తాము ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆమోదించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. మున్సిప‌ల్ కార్పొరేష‌న్ తీసుకున్న చ‌ర్య అన‌ధికారం అన‌డంలో త‌మ‌కు ఎలాంటి సందేహం...

  • Sanjay Kasula
  • Publish Date - 3:43 pm, Fri, 27 November 20
ప‌గ తీర్చుకోవ‌డానికి ఇచ్చిన ఆర్డ‌ర్‌లాగా ఉంది... ఇది పౌరుల హ‌క్కుల‌కు భంగం.. బాలీవుడ్ క్వీన్‌కు బాంబే హైకోర్టు ఊర‌ట..

బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్‌కు బాంబే హైకోర్టు ఊర‌టనిచ్చింది. ఆమె భ‌వ‌నంలో కొంత భాగాన్ని కూల్చేందుకు బృహ‌న్‌ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (BMC) ఇచ్చిన ఆర్డ‌ర్‌ను కొట్టివేసింది. ఇది ఆమెపై ప‌గ తీర్చుకోవ‌డానికి ఇచ్చిన ఆర్డ‌ర్‌లాగా ఉందని కామెంట్ చేసింది.

ఏ పౌరుడిపై అయినా అధికారులు ఇలా బ‌ల ప్ర‌యోగం చేయ‌డాన్ని తాము ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆమోదించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. మున్సిప‌ల్ కార్పొరేష‌న్ తీసుకున్న చ‌ర్య అన‌ధికారం అన‌డంలో త‌మ‌కు ఎలాంటి సందేహం లేద‌ని డివిజ‌న్ బెంచ్ న్యాయ‌మూర్తులు ఎస్‌జే క‌థావాలా, ఆర్ఐ చాగ్లా అన్నారు. సెప్టెంబ‌ర్ 9న బీఎంసీ అధికారులు త‌న బంగ్లాను కూల్చేయ‌డాన్ని స‌వాలు చేస్తూ కంగ‌నా కోర్టుకెక్కింది.

బీఎంసీ ఇలా చేయ‌డం క‌చ్చితంగా చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని, పౌరుల హ‌క్కుల‌కు భంగం క‌లిగించ‌డమే అవుతుంద‌ని హైకోర్టు వ్యాఖ్యానించింది. న‌ష్ట‌ప‌రిహారానికి సంబంధించి ప్ర‌త్యేకంగా జరిగిన న‌ష్టాన్ని అంచ‌నా వేయ‌డానికి ఓ వాల్యూయ‌ర్‌ని నియ‌మిస్తున్న‌ట్లు కోర్టు తెలిపింది. 2021 మార్చిలోపు జ‌రిగిన న‌ష్టంపై నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించింది.