అక్రమాల ఫిర్యాదులకు బీజేపీ టోల్ ఫ్రీ నంబరు

పశ్చిమబెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న రాజకీయాలు వేడెక్కాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ సర్కారుపై విపక్షాలు విమర్శల బాణాలను ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాటం షురూ చేసింది.

  • Balaraju Goud
  • Publish Date - 4:22 pm, Thu, 20 August 20
అక్రమాల ఫిర్యాదులకు బీజేపీ టోల్ ఫ్రీ నంబరు

పశ్చిమబెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న రాజకీయాలు వేడెక్కాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ సర్కారుపై విపక్షాలు విమర్శల బాణాలను ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాటం షురూ చేసింది. ఇందులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ సర్కారు అక్రమాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా టోల్ ఫ్రీ నంబరును ఆ రాష్ట్ర బీజేపీ అందుబాటులోకి తీసుకువచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ అక్రమాలపై పోరాడేందుకే తాము టోల్ ఫ్రీ నంబరును ప్రారంభించామని పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చెప్పారు.

తృణమూల్ సర్కారు అవినీతిపై ప్రజలు ఫిర్యాదులు చేస్తే తాము వాటిపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు దిలీప్. తాము ఫిర్యాదుదారుల వివరాలను కేంద్రానికి పంపిస్తామని, సర్వత్రమే సమస్యల పరిష్కారిస్తామని దిలీప్ చెప్పారు. ఆంఫన్ తుపాన్ సాయం పంపిణీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని బీజేపీ ఎంపీ ఆరోపించారు. పుర్బామెదినీపూర్, నార్త్ 24 పరగణాస్, సౌద్ 24 పరగణాస్, నాడియా, హౌరా జిల్లాల్లో తుపాన్ సాయం పంపిణీలో అక్రమాలపై బీజేపీ నిరసనలు చేపట్టింది. అక్రమాలకు పాల్పడిన తృణమూల్ కాంగ్రెస్ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని బెంగాల్ రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తోంది.