తిరుపతిని అభివృద్ది చేసింది బీజేపీనే, బహిరంగ చర్చకు సిద్దం..శోభాయాత్రలో సోము వీర్రాజు సవాల్

తిరుపతిలో బీజేపీ శోభాయాత్ర ప్రారంభమైంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  సోము వీర్రాజు, బీజేపీ తిరుపతి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు...

 • Ram Naramaneni
 • Publish Date - 7:53 pm, Sat, 12 December 20
తిరుపతిని అభివృద్ది చేసింది బీజేపీనే, బహిరంగ చర్చకు సిద్దం..శోభాయాత్రలో సోము వీర్రాజు సవాల్

తిరుపతిలో బీజేపీ శోభాయాత్ర ప్రారంభమైంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  సోము వీర్రాజు, బీజేపీ తిరుపతి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర పార్టీ  శోభాయాత్ర నిర్వహిస్తుంది. ఈ రోజు  సాయంత్రం తిరుపతి ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ రోడ్డు వరకు శోభాయాత్ర ప్రారంభమైంది. శోభాయాత్రలో బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 12 Dec 2020 19:53 PM (IST)

  వాగులు, వంకలు పక్కనే ఉన్నా రాష్ట్రంలో ఇసుక దొరకట్లా..

  వాగులు, వంకలు పక్కనే ఉన్నా ఏపీలో ఇసుక దొరకడం కష్టతరంగా మారిందని సోము వీర్రాజు పేర్కొన్నారు. బూమ్..బూమ్ అంటూ కొత్త తరహా లిక్కర్ బ్రాండ్లు తెచ్చి అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. జగన్‌కు, ఆయన అనుచరులకు మాత్రమే ఆ బ్రాండ్ల పేర్లు తెలిస్తాయన్నారు. జగన్ నీతి, నియామాలు మర్చిపోయారని ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

 • 12 Dec 2020 19:47 PM (IST)

  బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

  బీజేపీ కార్యకర్తలు తిరుపతిలో గల్లీగల్లీకి తిరిగి ప్రజల గుండెలను తట్టి..కమలం గుర్తుకు ఓటు వేసేలా కృషి చేయాలని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. వైసీపీకి 21 సీట్లు, టీడీపీకి 4 ఎంపీ సీట్లు ఉన్నాయని..వారి వల్ల ఉపయోగం ఏమి లేదన్నారు. తమకు సీటు లేకుండానే  తిరుపతిని ఇంత అభివృద్ది చేశామని..తిరుపతిలో గెలిపిస్తే మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు.

   

 • 12 Dec 2020 19:35 PM (IST)

  దొందూ దొందే

  వైసీపీ, కాంగ్రెస్ దొందూ దొందే అని సోము వీర్రాజు చెప్పారు. రెండూ కుటుంబ పార్టీలని పేర్కొన్నారు. భార్యను సైతం త్యజించి మోదీ దేశమాతకు సేవ  చేస్తున్నారని చెప్పారు. జగన్, చంద్రబాబులకు..నరేంద్ర మోదీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని పేర్కొన్నారు. ఈ సమయంలో నక్కలు కావాలో, నాగలోకంలో ఉన్న నరేంద్ర మోదీ కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు.

 • 12 Dec 2020 19:27 PM (IST)

  కలప రవాణా చేసినట్టు..ఎర్ర చందనాన్ని రవాణా చేస్తున్నారు..

  ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలందరూ బీజేపీ వెంట నడవడానికి సిద్దంగా ఉన్నారని, మోదీ నాయకత్వంపై నమ్మకం చూపుతున్నారని సోము వీర్రాజు వెల్లడించారు. కలపను తీసుకెళ్లినట్లు ఎర్ర చందనం రవాణా చేస్తున్నారని..దీనిని బీజేపీ నిశితంగా గమనిస్తుందన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపే పోలీసులను వైసీపీ సర్కార్ ట్రాన్స్‌ఫర్ చేస్తుందని ఆరోపించారు. తిరుపతి ప్రజలు వైసీపీ సర్కార్‌కు బుద్ది చెప్పే సమయం వచ్చిందన్నారు.

 • 12 Dec 2020 19:19 PM (IST)

  తిరుపతిని అభివృద్ది చేసింది బీజేపీనే, బహిరంగ చర్చకు సిద్దం

  అనేక రకాలైన విద్యాసంస్థలను తిరుపతికి ప్రధాని మోదీ అందించారని సోము వీర్రాజు పేర్కొన్నారు. పాకశాస్త్ర యూనివర్సిటీ సహా ఐదు యూనివర్సిటీలను తిరుపతి చుట్టూరా మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వం గానీ, ఈ ప్రభుత్వం గానీ  తిరుపతి పట్టణానికి చేయనంత అభివృద్దిని బీజేపీ సర్కార్ చేసిందని వివరించారు. దీనిపై బహిరంగ చర్చకు రెడీ అని సవాల్ విసిరారు. దమ్ముంటే ఒకే వేదికపై రావాలని వైసీపీ, టీడీపీలకు ఛాలెంజ్ చేశారు.

 • 12 Dec 2020 19:14 PM (IST)

  బీజేపీ హయాంలోనే తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి వచ్చింది

  ధర్మానికి వ్యతిరేకంగా టీటీడీ బోర్డులో వ్యక్తులను నియమించే ప్రయత్నం చేశారు. అలాంటి చర్యలను బీజేపీ ఖండించిదని శోభాయాత్రలో సోము వీర్రాజు పేర్కొన్నారు. తిరుపతి పట్టణం కోసం సుమారు రూ.1000 కోట్ల రూపాయలను అభివృద్ది కార్యక్రమాల కోసం బీజేపీ ప్రభుత్వం కేటాయించిదని ఆయన తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక, తిరుపతి విమానశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దామని ఆయన పేర్కొన్నారు.