టీఆర్ఎస్ – ఎంఐఎం చీకటి ఒప్పందాలను త్వరలోనే బయట పెడతాం, ఆ పార్టీతో ‘సంధి లేదు.. సమరమే’

TRS - MIM చీకటి ఒప్పందాలను త్వరలోనే బయట పెడతామన్నారు BJP సీనియర్‌ నేత మురళీధరరావు. TRSతో సంధి లేదని, సమరమేనని..

  • Venkata Narayana
  • Publish Date - 2:00 pm, Tue, 22 December 20
టీఆర్ఎస్ - ఎంఐఎం చీకటి ఒప్పందాలను త్వరలోనే బయట పెడతాం, ఆ పార్టీతో 'సంధి లేదు.. సమరమే'

TRS – MIM చీకటి ఒప్పందాలను త్వరలోనే బయట పెడతామన్నారు BJP సీనియర్‌ నేత మురళీధరరావు. TRSతో సంధి లేదని, సమరమేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు డ్రైవర్‌ లేడు… స్టీరింగ్‌ లేదని ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విమర్శలు చేశారు. తెలంగాణలో సాధారణ పాలన జరగడం లేదన్న మురళీధర్ రావు, ఎన్నికలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి.. అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో బీజేపీ గెలుపు తరువాత ప్రభుత్వం ఫిట్స్ వచ్చినట్టుగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం అని ఒక ప్రకటన చేసిందని విమర్శించారు. నాగార్జునసాగర్ డిగ్రీ కాలేజ్ కూడా ఎన్నికల కోసమే ప్రకటనని ఆయన చెప్పుకొచ్చారు.