రాజధాని మార్పు ఖాయం.. జీవీఎల్ జోస్యం

కొద్ది రోజులుగా ఏపీ రాజధానిపై పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇప్పుడు తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు దీనిపై స్పందించారు. ఏపీ రాజధానిని మార్చడం ఖాయం అని చెప్పారు. అమరావతిలో రాజధానిని కొనసాగించే ఆలోచనలో వైసీపీ లేదని అన్నారు. ఈ అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని.. దీనిపై జగన్ సర్కార్ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని అంశం పై రాష్ట్ర మంత్రులు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని.. ఈ గందరగోళానికి […]

రాజధాని మార్పు ఖాయం.. జీవీఎల్ జోస్యం
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2019 | 4:13 PM

కొద్ది రోజులుగా ఏపీ రాజధానిపై పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇప్పుడు తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు దీనిపై స్పందించారు. ఏపీ రాజధానిని మార్చడం ఖాయం అని చెప్పారు. అమరావతిలో రాజధానిని కొనసాగించే ఆలోచనలో వైసీపీ లేదని అన్నారు. ఈ అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని.. దీనిపై జగన్ సర్కార్ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని అంశం పై రాష్ట్ర మంత్రులు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని.. ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అన్నారు. రాజధానిని మార్చితే.. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని తెలపాలన్నారు. అమరావతి పేరుతో పలు కంపెనీలకు, వ్యక్తులకు రైతుల భూములను తక్కువ ధరలకే అమ్మేశారని జీవీఎల్ ఆరోపించారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల కోసం సీఎం జగన్ ప్రభుత్వం రూ.187.44 కోట్ల నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే.