గాల్వన్ లోయలో చనిపోయిన చైనా ఆర్మీ లెక్క తేలిందా..?

చైనా నుంచే అసలు లెక్కలు బయటకు వచ్చాయి. జూన్ 15 న తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయలో చైనాకు చెందిన సైనికులు 100 మందికి పైగా చనిపోయారని ఆ దేశానికి చెందిన ఒకరు పేర్కొన్నట్లు బిజెపి నాయకుడు కపిల్ మిశ్రా సోమవారం ఒక వివాదాస్పద పోస్ట్ ను ట్వీట్ చేశారు.

గాల్వన్ లోయలో చనిపోయిన చైనా ఆర్మీ లెక్క తేలిందా..?
Follow us

|

Updated on: Jul 07, 2020 | 5:06 PM

భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో 21 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. అయితే చైనాకు చెందిన సైనికులు ఎంతమంది మరణించారనేది ఆ దేశం అధికారికంగా ప్రకటించలేదు. దీంతో, చైనాకు చెందిన సైనికులు 40 నుంచి 45 మంది వరకూ చనిపోయి వుండవచ్చని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా చైనా నుంచే అసలు లెక్కలు బయటకు వచ్చాయి. జూన్ 15 న తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయలో చైనాకు చెందిన సైనికులు 100 మందికి పైగా చనిపోయారని ఆ దేశానికి చెందిన ఒకరు పేర్కొన్నట్లు బిజెపి నాయకుడు కపిల్ మిశ్రా సోమవారం ఒక వివాదాస్పద పోస్ట్ ను ట్వీట్ చేశారు.

చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సిపిసి) మాజీ నాయకుడి కుమారుడు యాంగ్ జినాలి ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ కపిల్ మిశ్రా తెలిపారు. చైనా ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని ఆరోపించిన యాంగ్ జినాలి.. గాల్వాన్ వ్యాలీలో అసలు ఏం జరిగిందన్నది చైనా తరఫు నుంచి ఎన్నడూ బయటకు రాదని అన్నారు. భారత భూభాగంలోకి చైనా సైన్యం వెళ్లిన తరువాత పెద్ద యుద్ధమే జరిగిందని, 100 మందికి పైగా చైనా సైనికులు మరణించారని వెల్లడించిన ఆయన.. ఆ ప్రాంతానికి చైనా మరిన్ని బలగాలను తరలించినా, అక్కడి పరిస్థితులు భారత్ కే అనుకూలమని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చైనాలో హాట్ టాపిక్ గా మారాయి.

అయితే జినాలి ఎవరన్న విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మాజీ నాయకుడి కుమారుడు యాంగ్ జినాలి. ఇతను ప్రస్తుతం టియానన్మెన్ స్క్వేర్ కార్యకర్తగా కొనసాగుతున్నారు. అతను లాభాపేక్షలేని చైనా కోసం సిటిజెన్ పవర్ ఇనిషియేటివ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడుగా కూడా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం యుఎస్ లో నివసిస్తున్నాడు జినాలి.. గాల్వాన్ ఘర్షణకు సంబంధించి వాస్తవాలపై గత వారం ది వాషింగ్టన్ టైమ్స్ లో తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు. చైనా దళాలను కోల్పోయిందని అంగీకరించడానికి భయపడుతుందని, భారతదేశం కంటే చాలా ఎక్కువ మంది చనిపోయారన్న ఆయన కోల్పోయిన దళాల సంఖ్యను ప్రస్తావించలేదు.

అయితే, బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రాతో పాటు, అనేక ఇతర ట్విట్టర్ వినియోగదారులు గాల్వన్ ఘర్షణలో 100 మంది చైనా సైనికులు మరణించినట్లు ట్వీట్ చేసినట్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.