బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ‘నలుగుతున్న’ ఫేస్ బుక్

బీజేపీ నేతలు చేస్తున్న  ద్వేషపూరిత వ్యాఖ్యలను ఫేస్ బుక్ పట్టించుకోవడంలేదంటూ ఓ విదేశీ పత్రికలో ప్రచురితమైన ఓ ఆర్టికల్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఛిచ్చు రేపింది. బీజేపీ సోషల్ మీడియాను..

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య 'నలుగుతున్న' ఫేస్ బుక్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 16, 2020 | 7:31 PM

బీజేపీ నేతలు చేస్తున్న  ద్వేషపూరిత వ్యాఖ్యలను ఫేస్ బుక్ పట్టించుకోవడంలేదంటూ ఓ విదేశీ పత్రికలో ప్రచురితమైన ఓ ఆర్టికల్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఛిచ్చు రేపింది. బీజేపీ సోషల్ మీడియాను తనకు అనుకూలంగా ఎలా వినియోగించుకుంటోందో ఈ ఆర్థికలే నిదర్శనమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అయితే బీజేపీ ఎదురుదాడికి దిగుతూ.. మూడేళ్ళ నాటి కేంబ్రిడ్జ్ ఎనలిటికా స్కాండల్ ని గుర్తు చేసింది. ఎన్నికల ముందు మీరు చేసిన ఆడేటా స్కాండల్ గురించి మాకు తెలియదా అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు. ఫేస్ బుక్ హేట్ స్పీచ్ రూల్స్ కొల్లీడ్ విత్ ఇండియన్ పాలిటిక్స్ పేరిట వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ వ్యాసాన్ని ప్రచురించింది. ద్వేషపూరిత ప్రసంగాల విషయంలో బీజేపీ నేతలు, కార్యకర్తల అభ్యంతరకర కంటెంట్ కు సంబంధించి ఫేస్ బుక్ మరో విధంగా వ్యవహరిస్తోందని  ఈ ఆర్టికల్ పేర్కొంది. చూడబోతే ఫేస్ బుక్ కి బీజేపీ పట్ల చాలా పక్షపాతం ఉన్నట్టు కనిపిస్తోంది అని వ్యాఖ్యానించింది.

ఇండియాలో బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ ,ఫేస్ బుక్, వాట్సాప్ లను కంట్రోల్ చేస్తోందనడానికి ఈ ఆర్థికలే నిదర్శనమని రాహుల్ ట్వీట్ చేశారు. ఫేస్ బుక్ కి సంబంధించిన వాస్తవాలతో అమెరికా మీడియా బయటకు వచ్చిందన్నారు.