ఏపీలో దేవాలయాలపై దాడులు పతాకస్థాయికి చేరాయి. అందుకే దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా కోరుతున్నాం: సోము వీర్రాజు

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక దేవాలయాలపై వరుస దాడులు కొనసాగుతున్నాయని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు...

  • Venkata Narayana
  • Publish Date - 8:36 pm, Sun, 3 January 21
ఏపీలో దేవాలయాలపై దాడులు పతాకస్థాయికి చేరాయి. అందుకే  దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా కోరుతున్నాం:  సోము వీర్రాజు

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక దేవాలయాలపై వరుస దాడులు కొనసాగుతున్నాయని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. దేవాలయాలపై దాడుల వ్యవహారం పతాకస్థాయికి చేరుకున్న నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన టీవీ9తో చెప్పారు. దర్గాలు కడతానంటున్న దేవాదాయ శాఖ మంత్రికి రామ తీర్థం వెళ్లేంత వీలు లేకపోయిందని సోము విమర్శించారు.

బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలనే ఛలో రామతీర్ధకు జనసేనతో కలిసి బీజేపీ పిలుపునిచ్చిందని వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.. రాష్ట్రంలోని దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పెంచాల్సి ఉందని ఆయన డిమాండ్ చేశారు. హిందూ ఆలయాలపై దాడులు జరిగినప్పుడు బీజేపీ స్పందిస్తే తప్పుపట్టడం సరికాదని సోము వీర్రాజు అన్నారు.