బీహార్ లో జేడీ-యూ లో ముసలం ? ఈ పార్టీ నుంచి 17 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు, ఆర్జేడీ నేత శ్యామ్ రజక్

బీహార్ లో సీఎం నితీష్ కుమార్  నేతృత్వంలోని జేడీ-యూ నుంచి 17 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఆర్జేడీ నేత శ్యామ్ రజక్ తెలిపారు.

బీహార్ లో జేడీ-యూ లో ముసలం ? ఈ పార్టీ నుంచి 17 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు, ఆర్జేడీ నేత శ్యామ్ రజక్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 31, 2020 | 9:57 PM

బీహార్ లో సీఎం నితీష్ కుమార్  నేతృత్వంలోని జేడీ-యూ నుంచి 17 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఆర్జేడీ నేత శ్యామ్ రజక్ తెలిపారు. వీరంతా తమ పార్టీలో చేరేందుకు తహతహలాడుతున్నారని, అయితే పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం ఉన్నందున తామే వారిని నిలువరించామని ఆయన చెప్పారు. ఇప్పుడే మీరు మా పార్టీలో చేరితే మీ సభ్యత్వం కోల్పోతారని చెప్పామని రజక్ పేర్కొన్నారు. ఏది ఏమైనా నితీష్ కొత్త ప్రభుత్వాన్ని బీజేపీ తన చెప్పు చేతల్లో ఉంచుకోవడం పట్ల ఈ నేతలు తీవ్రఅసంతృప్తితో ఉన్నారని ఆయన తెలిపారు. 25 నుంచి 26 మంది జేడీయూ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరితే పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం వర్తించబోదని ఆయన అన్నారు. త్వరలో ఇది జరగనుందని చెప్పారు.

అయితే రజక్ వ్యాఖ్యలుతప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని, జేడీయూ లో ఏ ఎమ్మెల్యే కూడా అసంతృప్తిగా లేరని ఈ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ తెలిపారు. మా పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ఉన్నారు అని ఆయన తెలిపారు. మొదట  ఆర్జేడీ తన సభ్యులపై కన్నేసి ఉంచుకోవాలని ఆయన చెప్పారు. ఆ పార్టీ  నేత తేజస్వి యాదవ్ పని తీరును ఆ ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఈసడించుకుంటున్నారని రాజీవ్ రంజన్ వ్యాఖ్యానించారు.