‘మహా’లో కమల వికాసం.. ‘అందనిద్రాక్ష’గా హర్యానా !

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. టైమ్స్ నౌ, ఎన్డీటీవీ, ఇండియా టుడే-యాక్సిస్-మై ఇండియా, న్యూస్-18, ఏబీపీ న్యూస్ సీ ఓటర్ వంటి మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ గురువారం నాటి ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కనిపించాయి. కాకపోతే సహజంగానే కొన్ని చోట్ల కాస్త ‘ తడబడినట్టు ‘ కనిపిస్తుంది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపించింది. దాదాపు కంప్లీట్ స్వీప్ అన్నా ఆశ్చర్యం లేదు. ఈ రాష్ట్రంలో 288 సీట్లకు […]

'మహా'లో కమల వికాసం.. 'అందనిద్రాక్ష'గా హర్యానా !
Follow us

|

Updated on: Oct 24, 2019 | 1:47 PM

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. టైమ్స్ నౌ, ఎన్డీటీవీ, ఇండియా టుడే-యాక్సిస్-మై ఇండియా, న్యూస్-18, ఏబీపీ న్యూస్ సీ ఓటర్ వంటి మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ గురువారం నాటి ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కనిపించాయి. కాకపోతే సహజంగానే కొన్ని చోట్ల కాస్త ‘ తడబడినట్టు ‘ కనిపిస్తుంది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపించింది. దాదాపు కంప్లీట్ స్వీప్ అన్నా ఆశ్చర్యం లేదు. ఈ రాష్ట్రంలో 288 సీట్లకు గాను బీజేపీ-శివసేన కూటమిదే పైచేయి అవుతుందని, ఈ కూటమికి 230 సీట్లు, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి 48 స్థానాలు లభిస్తాయని టైమ్స్ నౌ ‘ ప్రిడిక్ట్ చేసింది. న్యూస్-18 ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ-శివసేన అలయెన్స్ 243 సీట్లను, , కాంగ్రెస్-ఎన్సీపీ 41 స్థానాలు దక్కించుకుంటాయని ‘ అంచనా. అలాగే.. కాషాయ కూటమికి 166 నుంచి 194 వరకు, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి 72 నుంచి 90 స్థానాలు లభిస్తాయని ఇండియా-టుడే-యాక్సిస్ మై జోస్యం చెప్పింది. హర్యానాలో 90 సీట్లకు గాను బీజేపీ 69, కాంగ్రెస్ కేవలం 11 స్థానాలను గెలుచుకుంటాయని ని ఇదే మీడియా అంచనా వేసింది.

అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దిగజారిపోతుందని ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వే పేర్కొంది. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వానికి ఢోకా లేదని, ఈ రాష్ట్రంలో బీజేపీ 72 సీట్లను కైవసం చేసుకుంటే.. కాంగ్రెస్ పార్టీ మరీ ఘోరంగా 8 సీట్లను మాత్రమే గెలుచుకుంటుందని ఈ సర్వే వెల్లడించింది. కాగా-ముఖ్యంగా పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో బీజేపీ-శివసేన పొత్తు ఈ కూటమికి లాభించింది. ఒకప్పుడు బీజేపీతో జట్టు కట్టేందుకు శివసేన వెనుకాడినా.. కమలం పార్టీ అధ్యక్షుడు, హోమ్ మంత్రి అమిత్ షా.. పలుమార్లు ముంబై వఛ్చి ఈ పార్టీ అధినాయకత్వంతో సంప్రదింపులు జరిపారు. రెండు పార్టీల మధ్య పొత్తు రాజకీయంగా ఇరు పార్టీలకూ ‘ భారీ ప్రయోజనమే ‘ అవుతుందని నమ్మబలికారు. ఆయన జోస్యమే నిజమైంది. శివసేన అధినేత ఆదిత్య థాక్రే కూడా అమిత్ షా వ్యూహాన్ని సమర్థించారు. రెండు పార్టీల మేనిఫెస్టోలూ వేర్వేరుగా ఉన్నప్పటికీ.. దాదాపు ఒకే విధమైన అభిప్రాయాలను ప్రతిబింబించాయి . ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలంతా మోదీ ప్రభుత్వానికి ‘ జై ‘ కొట్టారు. ఇటీవలే ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మోదీతో.. వారంతా సెల్ఫీలు దిగిన వైనమే ఇందుకు సాక్ష్యం. నటీనటులే కాదు..దర్శక నిర్మాతలూ వీరిలో ఉన్నారు.

దేశానికి మోదీ నాయకత్వం ఎంతో అవసరమని వారంతా ముక్తకంఠంతో ‘ నినదించారు ‘. ప్రధాని మోడీ పూణే వంటి నగరాల్లో జరిపిన ప్రచారాల్లో.. కాంగ్రెస్ ‘ బలహీనతను ‘ బాగా ఎండగట్టారు. ఈ దేశ ప్రయోజనాలను బీజేపీ మాత్రమే పరిరక్షించగలదన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని రద్దు చేసినందువల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు.కాగా- ఈ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో అసలు కాంగ్రెస్ ప్రభావమే కనిపించలేదు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్-ఎన్సీపీ తమ ఓట్లశాతాన్ని పెంచుకోగలిగాయి. బీజేపీ సీట్లు కొన్నింటిలో ఈ కూటమి అభ్యర్థుల జోరు కనిపించింది. కమలం పార్టీకి పట్టు ఉందని భావించిన స్థానాల్లో వీరి హవా కాస్త కనబడడమే ఇందుకు కారణం. హర్యానా విషయానికే వస్తే… ఈ రాష్ట్రంలో ఖట్టర్ ప్రభుత్వం మైనారిటీల ఓట్లనూ కొల్లగొట్టగలిగింది.

రాష్ట్ర అభివృధ్దిలో మీరూ భాగస్వాములేనని, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే మీరు కూడా ‘ కమల వికాసానికి ‘ దోహదపడాలని మనోహర్ లాల్ ఖట్టర్ పదేపదే చెబుతూ వచ్చారు. ఇక ప్రధాని మోదీ సైతం ఈ రాష్ట్రానికి, పంజాబ్ కు మధ్య నదీజలాల వివాద పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని ఇఛ్చిన హామీ కూడా తన ప్రభావం చూపింది. సట్లెజ్ నదీ జలాల విషయంలో ఈ రాష్ట్రాల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతూ వస్తోంది. స్థానిక సమస్యల పరిష్కారంలో బీజేపీ ఎప్పుడూ ముందంజలో ఉంటుందన్న వాగ్దానం కూడా హర్యానాలో ఈ పార్టీకి కలిసొచ్చింది.

హంగ్ దిశగా హర్యానా.. తాజా ఫలితాల ప్రకారం.. హర్యానాలో హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. 90 సీట్లకు గాను బీజేపీ 38 చోట్ల, కాంగ్రెస్ 32 స్థానాల్లో, ఐ ఎన్ ఎల్ డీ +2, జేజేపీ 10 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర వహించే అవకాశాలు కనబడుతున్నాయి. నిజానికి ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం.. ఈ రాష్ట్రంలో బీజేపీ గెలిచేందుకు స్ఫష్టమైన ఛాన్స్ ఉంది. కానీ.. తీరు చూస్తే ఈ అంచనాలు తారుమారు కావడం కొసమెరుపు.

సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!