సాహోకు ఎదురుదెబ్బ.. ఫ్యాన్స్‌కు ఇక పండగే..

సాహోకు ఎదురుదెబ్బ.. ఫ్యాన్స్‌కు ఇక పండగే..

ప్రపంచవ్యాప్తంగా సాహో మేనియా నడుస్తోంది. ఈ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్స్‌లో సందడి చేయనుంది. అయితే తాజాగా సాహోకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఈ సినిమా టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వానికి సాహో నిర్మాతలు అర్జీ పెట్టుకున్నారు. సాధారణ బడ్జెట్ కంటే దీనికి.. ఎక్కువ మొత్తంలో మనీ వెచ్చించామని.. దీని టికెట్ రేట్స్ పెంచుకోడానికి కాస్త అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. కాగా, ముందు ఒకే అన్నట్లు మౌనంగా ఉన్న అధికారులు ఇప్పుడు బాంబ్ పేల్చారు. ప్రభుత్వానికి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 28, 2019 | 8:26 PM

ప్రపంచవ్యాప్తంగా సాహో మేనియా నడుస్తోంది. ఈ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్స్‌లో సందడి చేయనుంది. అయితే తాజాగా సాహోకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఈ సినిమా టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వానికి సాహో నిర్మాతలు అర్జీ పెట్టుకున్నారు. సాధారణ బడ్జెట్ కంటే దీనికి.. ఎక్కువ మొత్తంలో మనీ వెచ్చించామని.. దీని టికెట్ రేట్స్ పెంచుకోడానికి కాస్త అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. కాగా, ముందు ఒకే అన్నట్లు మౌనంగా ఉన్న అధికారులు ఇప్పుడు బాంబ్ పేల్చారు. ప్రభుత్వానికి అన్ని సినిమాలు ఒక్కటేనని.. చిన్న పెద్ద తేడా ఉండదని చెప్పారు. అందుకే సాహోకు టికెట్ రేట్స్ పెంచుకోడానికి అనుమతి ఇవ్వలేమంటూ తేల్చి చెప్పారు. దాంతో సాహో టీంకు షాక్ తగిలినట్లైంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే సమాధానం చెప్పింది. అసలు ఇక్కడ ఓ సినిమాకు టికెట్ రేట్స్ పెంచి.. మరో సినిమాకు తగ్గించడం అనే కాన్సెప్టే లేదని అధికారులు చెప్పేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu