ఏపీ రాజధానిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్..నేతల పేర్లు చెప్పిన పేర్ని నాని..!

అమరావతిపై టీడీపీ, వైసీపీ మధ్య కొంతకాలంగా సాగుతున్న యుద్ధం కీలకదశకు చేరుకుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కొన్నిరోజుల ముందు- రాజధానిపై రెండు పార్టీలు పోటాపోటీ రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించాయి. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా రాజధాని-మన అమరావతి రౌండ్‌టేబుల్‌కి 8 పార్టీలు, 19 సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. రాజధానిపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని టీడీపీ రౌండ్‌టేబుల్‌ డిమాండ్‌ చేసింది. రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో ఎలాంటి మార్పులు చేయొద్దని తీర్మానించారు. రాజధాని పనులు ఆగిపోవడంపై […]

ఏపీ రాజధానిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్..నేతల పేర్లు చెప్పిన పేర్ని నాని..!
Follow us

|

Updated on: Dec 05, 2019 | 10:06 PM

అమరావతిపై టీడీపీ, వైసీపీ మధ్య కొంతకాలంగా సాగుతున్న యుద్ధం కీలకదశకు చేరుకుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కొన్నిరోజుల ముందు- రాజధానిపై రెండు పార్టీలు పోటాపోటీ రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించాయి. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా రాజధాని-మన అమరావతి రౌండ్‌టేబుల్‌కి 8 పార్టీలు, 19 సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.

రాజధానిపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని టీడీపీ రౌండ్‌టేబుల్‌ డిమాండ్‌ చేసింది. రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో ఎలాంటి మార్పులు చేయొద్దని తీర్మానించారు. రాజధాని పనులు ఆగిపోవడంపై ఈ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన- రాజధానిలో చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం అనే రౌండ్‌టేబుల్‌కి బీజేపీ, సీపీఐతోపాటు రైతుసంఘాలు హాజరయ్యాయి. తమకు అన్యాయం జరిగిందని దళిత రైతులు ఆరోపించారు. అమరావతిని తన స్వార్థానికి కట్టలేదన్న చంద్రబాబు, ప్రజలు తప్పు అని అంటే తాను 5 కోట్ల మంది ఆంధ్రులకు క్షమాపణ చెబుతానని చంద్రబాబు ఇవాళ్టి సమావేశంలో రెండుసార్లు చెప్పడం విశేషం.

రాజధాని నిర్మాణాన్ని శఠగోపం సినిమా అని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. రాజధాని పేరుతో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎంక్వైరీలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. సీఆర్‌డీఏ ప్రాంతం అనేది 7000 నుంచి 8300కి పెంచారని, 174 చదరపు కిలోమీటర్లలో టీడీపీకి  కావల్సిన వాళ్లు భూములు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యాపారం చేసుకోవడానికి, ఇది మంచి ప్రాజెక్టు అని చెప్పుకోవడానికి సింగపూర్‌ కంపెనీలను వాడుకున్నారని బుగ్గన ఆరోపించారు.  ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతలపై వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. తమ బీనాబీలతో చాలామంది నేతలు అక్కడ రాజధాని ప్రకటన కంటే ముందే ఈ భూములు కొన్నారంటూ పేర్కొన్నారు. ఈ విషయంపై టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వేదికగా చర్చ జరిగింది.

ఈ డిస్కషన్‌లో పాల్గొన్న ఏపీ మంత్రి పేర్ని నాని..అక్కడ భూములు కొన్న కొందరి నేతల పేర్లను ప్రస్తావించారు. మాజీ మంత్రి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, కొమ్మాలపాటి శ్రీధర్, మురళి మోహన్ లాంటి చాలామంది నాయకులు బినాబీలలో రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేయించారని ఆరోపించారు. జూన్ 2014 నుంచి డిసెంబర్ 2014 మధ్యన రాజధాని ప్రకటనకు ముందే ఈ కొనుగోళ్లు జరగడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఈ ఇష్యూకి సంబంధించి పూర్తి అప్డేట్స్ దిగువ వీడియోలో..

SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా