ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై ‘బిగ్ న్యూస్- బిగ్ డిబేట్‌’లో కీలక చర్చ!

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కౌంటర్ దాఖలు చేశారు. సమ్మెపై కార్మిక సంఘాలు వివరణ ఇచ్చాయి. మరోవైపు, ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. అంతేకాదు కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని కోర్టుకి తెలిపింది. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుని బస్ పాస్ హోల్డర్స్‌ను ప్రయాణానికి అనుమతి […]

  • Ram Naramaneni
  • Publish Date - 10:44 pm, Thu, 10 October 19
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై 'బిగ్ న్యూస్- బిగ్ డిబేట్‌'లో కీలక చర్చ!

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కౌంటర్ దాఖలు చేశారు. సమ్మెపై కార్మిక సంఘాలు వివరణ ఇచ్చాయి. మరోవైపు, ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. అంతేకాదు కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని కోర్టుకి తెలిపింది. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుని బస్ పాస్ హోల్డర్స్‌ను ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారా అని ప్రశ్నించింది. ఇప్పటికే అన్ని డిపో మేనేజర్లకు ఆదేశాలు ఇచ్చామని ప్రభుత్వం పేర్కొంది. అయితే, మరోసారి పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, ప్రభుత్వం దాఖలు చేసీన కౌంటర్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇక డెడ్‌లైన్‌లోపు ఉద్యోగంలో చేరని ఎంప్లాయిస్ అందరూ.. ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులు కాదని ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రజారవాణా విషయంలో కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేశిస్తుంది. ఆదివారానికి దసరా సెలవులు పూర్తయ్యి, సోమవారం పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు బస్సు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. అయితే, ఇప్పట్లో ఆ సమస్య తీరే అవకాశం లేనందున సెలవులను మరో మరో రెండు, మూడు రోజులపాటు పొడిగించే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన వాహనాలను ఆర్టీసీ బస్సులో స్థానంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవాలని అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. అందువల్ల విద్యార్థులకు సెలవులు పొడిగిస్తే సమస్య ఉండదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా..ప్రజలు మాత్రం ఆర్టీసీ సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఇబ్బందులపై, సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన విరుగుడు చర్యలపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ రాజకీయ నాయకులు, జేఏసీ నేతలు, నిపుణులతో  బిగ్ న్యూస్-బిగ్ డిబేట్ వేదికగా కీలక చర్చ లేవనెత్తారు. ఆ అబ్డేట్స్…దిగువన వీడియోలో!