151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు నా చిటికంత… పవన్‌లో ఈ బూస్ట్‌కి కారణం బీజేపీనా..?

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కుండబద్దలుకొట్టారు. ప్రత్యేకహోదా కోసం తాను బీజేపీతో విభేదించానేగానీ, ఆ పార్టీకి బీజేపీ దూరంగా లేనని  తేల్చిచెప్పారు. 2014 లాగానే తాను మొన్నటి ఎన్నికలప్పుడు కూడా బీజేపీ, టీడీపీతో జతకట్టి ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చేదా అంటూ ప్రశ్నించారు. మరోవైపు వైసీపీ నేతలకు అమిత్‌ షా అంటే భయమనీ, తనకు మాత్రం ఆయనంటే గౌరవమని పవన్‌ చెప్పడం ఏపీ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌ అయింది. ఒకప్పుడు విలీనంపై తమ ఆఫర్‌ను తిరస్కరించిన పవన్‌ […]

151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు నా చిటికంత... పవన్‌లో ఈ బూస్ట్‌కి కారణం బీజేపీనా..?
Follow us

|

Updated on: Dec 04, 2019 | 10:20 PM

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కుండబద్దలుకొట్టారు. ప్రత్యేకహోదా కోసం తాను బీజేపీతో విభేదించానేగానీ, ఆ పార్టీకి బీజేపీ దూరంగా లేనని  తేల్చిచెప్పారు. 2014 లాగానే తాను మొన్నటి ఎన్నికలప్పుడు కూడా బీజేపీ, టీడీపీతో జతకట్టి ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చేదా అంటూ ప్రశ్నించారు. మరోవైపు వైసీపీ నేతలకు అమిత్‌ షా అంటే భయమనీ, తనకు మాత్రం ఆయనంటే గౌరవమని పవన్‌ చెప్పడం ఏపీ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌ అయింది.

ఒకప్పుడు విలీనంపై తమ ఆఫర్‌ను తిరస్కరించిన పవన్‌ కల్యాణ్‌, తనకు తానుగా వస్తానంటే- బీజేపీ వెల్‌కమ్‌ సాంగ్‌ ప్లే చేస్తోంది. కానీ తమ భుజాలపై ఆరడుగుల బుల్లెట్‌ను పేల్చుతామంటే ఒప్పుకునేది లేదంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈమధ్యకాలంలో టీడీపీ, జనసేన తమకు అనుకూలంగా మాట్లాడుతున్నాయనీ, వీళ్ల గుండె మారిందా అంటూ జీవీఎల్‌ సెటైర్లు వేస్తున్నారు.

కాగా పవన్ వ్యాఖ్యలను వైసీపీ లైట్ తీసుకుంటుంది. జనసేనానికి అంత సీన్ లేదంటూ కొట్టి పారేస్తుంది. మరోవైపు ఆర్నెల్ల కిందట ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీచేసిన వామపక్షాలు మాత్రం పవన్‌ కల్యాణ్‌ బీజేపీ అనుకూల వ్యాఖ్యలపై రగిలిపోతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని, విభజన హామీలు నెరవేర్చని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఏవిధంగా కరెక్టో చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిలదీశారు. ప్రాంతీయ పార్టీలకు బీజేపీని ఎదుర్కొనే ధైర్యం లేదని సీపీఐ విమర్శించింది.

బీజేపీ విషయంలో పవన్‌ కల్యాణ్‌ వైఖరి జనసేనకు ఆత్మహత్యా సదృశమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. అమిత్‌ షా‌ను గౌరవించేంత జ్ఞానోదయం పవన్‌ ఎప్పుడైందని ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీలని కబళిస్తూ, రాష్ట్రానికి మంచిపని చేయని అమిత్‌ షా ఎలా కరెక్టో చెప్పాలని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. పవన్‌ కల్యాణ్‌ బీజేపీకి అనుకూలంగా మాట్లాడటాన్ని టీడీపీ మాత్రం తప్పుపట్టడం లేదు. పైగా బీజేపీ అంటే తమ పార్టీకి కూడా వ్యతిరేకత ఎందుకు ఉంటుందని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేకహోదా కోసమే తాము బీజేపీతో విభేదించామన్నారు. ఇలా ఏపీలో పవన్ కొత్త రాజకీయాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఇదే అంశంపై టీవీ9 బిగ్ న్యూస్- బిగ్ డిబేట్ నిర్వహించింది.

కాగా పవన్ చేసిన ఒక కామెంట్ మాత్రం  వైసీపీ లీడర్స్‌లో ఆగ్రహాన్ని రగిల్చింది. వైసీపీ 151  మంది ఎమ్మెల్యేలు నా రెండు చిటికెలంత పవన్ కొద్దిగా లిమిట్స్ క్రాస్ చేశారు. కాగా పవన్ ఇంత సడన్‌గా యాక్టీవ్ అవ్వడానికి రీజన్ ఏంటి..? బీజేపీ వెనుకుండి గేమ్ ఆడిస్తుందా..? ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఆయనకు బూస్ట్ ఎక్కడనుంచి లభించింది అని టీవీ మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్, బిగ్ డిబేట్ వేదికగా బీజేపీ ఎంపీ జీవీఎల్‌‌ను ప్రశ్నించారు.

కాగా అసెంబ్లీలో సీట్లు, ఉన్నా లేకపోయినా..మాట్లాడే అవకాశం, అధికారం ఉంటుదని జీవీఎల్ సమాధానమిచ్చారు. దానికి కేంద్ర ప్రభుత్వం వెనకుంది అని చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఆయన ఢిల్లీ వచ్చి వెళ్లిన విషయం తెలుసని..కానీ ఎవర్ని కలిశారో తనకు కూడా తెలియదని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలను వైసీపీ ఎందుకు ఇంత సీరియస్‌గా తీసుకుంటుందో అర్థం కావట్లేదన్న జీవీఎల్..పవన్ తమతో కలిసొస్తానంటే ఆహ్వానం ఉంటుదని చెప్పారు. ఆ చర్చ పూర్తి సారాంశం దిగువ వీడియోలో..