హెచ్-1 బీ వీసాలపై వెనక్కి తగ్గుతున్న జోబైడెన్ ప్రభుత్వం, జారీలో మరింత జాప్యం ?

కొత్త హెచ్-1బీ వీసాల జారీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన బ్యాన్ కు స్వస్తి చెప్పే విషయంలో ప్రెసిడెంట్ జోబైడెన్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని......

  • Umakanth Rao
  • Publish Date - 3:59 pm, Tue, 2 March 21
హెచ్-1 బీ వీసాలపై వెనక్కి తగ్గుతున్న జోబైడెన్ ప్రభుత్వం, జారీలో మరింత జాప్యం ?

కొత్త హెచ్-1బీ వీసాల జారీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన బ్యాన్ కు స్వస్తి చెప్పే విషయంలో ప్రెసిడెంట్ జోబైడెన్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.  దీని బదులు శరణార్థులుగా ఈ దేశానికి చేరిన వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని, ఈ అంశానికి తాము అధిక ప్రాధాన్యమిస్తున్నామని  హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ  సెక్రెటరీ అలెజాండ్రో మెర్కుసా తెలిపారు. మొదట తమ దేశాల్లో వేధింపులను భరించలేక అమెరికాకు వలస వఛ్చినవారి విషయాన్ని పరిశీలించాల్సి ఉందని బైడెన్ ప్రభుత్వం భావిస్తోందన్నారు. పైగా డెమొక్రాట్ సభ్యులు కూడా హెచ్-1 బీ వీసాలకన్నా శరణార్థులు, వ్యవసాయ కార్మికులకు సాయపడడం, చట్ట విరుద్ధంగా తమ పేరెంట్స్ తో ఈ దేశానికి వఛ్చిన పిల్లలను ఆదుకోవడం, ఇమిగ్రేషన్ విషయంలో స్కిల్డ్ వర్కర్స్  ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడం వంటి అంశాలకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని వారు కూడా భావిస్తున్నారు. కొత్త హెచ్-1బీ వీసాల జారీపై నిషేధం విధిస్తు గత జనవరిలో..తను పదవి నుంచి దిగిపోయేముందు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. దీనివల్ల అమెరికన్లకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు.

అయితే  ఆ తరువాత నూతన అధ్యక్షుడు జోబైడెన్.. ట్రంప్ జారీ చేసిన పలు ఉత్తర్వులను మార్చివేస్తూ వచ్చారు. ముస్లిం వీసా బ్యాన్ ఎత్తివేత, గ్రీన్ కార్డుల విషయంలో సరికొత్త నిర్ణయాలు, ముస్లిం దేశాల వాసులు కూడా అమెరికాలో ఎంట్రీ కావడానికి అవకాశాలు కల్పిస్తూ పలు ఆర్డర్స్  జారీ చేశారు. కాగా-ముఖ్యంగా హెచ్-1 బీ వీసాల అంశంలో బైడెన్ ప్రభుత్వం ఇటీవలే ముఖ్యంగా భారతీయులకు తీపి కబురు అందించింది. వీటిపై బ్యాన్ ఎత్తివేస్తామని ప్రకటించగానే వీటికోసం వేచి ఉన్న లక్షలాది భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. ఇక తమ సమస్య తీరిపోయినట్టేనని భావించారు. కానీ డెమొక్రాట్ల తాజా యోచనతో  బైడెన్ సర్కార్ మళ్ళీ వెనక్కి తగ్గుతున్నట్టు  సమాచారం.

 

మరిన్ని ఎక్కడ చదవండి: