గిరిజ‌న గ్రామం నుంచి ఎమ్మెల్యే సీతక్కను వెనక్కి పంపించిన పోలీసులు..

గిరిజ‌న గ్రామం నుంచి ఎమ్మెల్యే సీతక్కను వెనక్కి పంపించిన పోలీసులు..

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా దేశంలో లాక్‌డౌన్ విధించిన‌ప్ప‌టి నుంచి సామాన్య ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందుల‌కు గుర‌వుతోన్న విష‌యం తెలిసిందే. గ్రామీణ‌, న‌గ‌ర ప్రాంతాల్లోనే క‌ష్ట‌జీవుల వెత‌లు లాక్‌డౌన్ ప్రారంభమైనప్ప‌టి నుంచి అనేకం చూశాం. ఇక్క‌డే ప‌రిస్థితి ఇలా ఉందంటే..అడ‌వి బిడ్డ‌ల అరణ్య రోద‌న వ‌ర్ణించ‌డం క‌ష్టం. అన్ని ఆదాయ‌మార్గాలు మూసుకుపోయిన నేప‌థ్యంలో వారికి గుప్పెడు మెతుకులు దొర‌క‌డం కూడా క‌ష్ట‌త‌రంగా మారింది. ప్ర‌భుత్వం ఇచ్చే నిత్యావ‌స‌రాల‌ను వారు నివాసం ఉంటోన్న‌ ప్రాంతాల‌కు చేర్చడం కూడా చాలా […]

Ram Naramaneni

|

May 09, 2020 | 4:46 PM

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా దేశంలో లాక్‌డౌన్ విధించిన‌ప్ప‌టి నుంచి సామాన్య ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందుల‌కు గుర‌వుతోన్న విష‌యం తెలిసిందే. గ్రామీణ‌, న‌గ‌ర ప్రాంతాల్లోనే క‌ష్ట‌జీవుల వెత‌లు లాక్‌డౌన్ ప్రారంభమైనప్ప‌టి నుంచి అనేకం చూశాం. ఇక్క‌డే ప‌రిస్థితి ఇలా ఉందంటే..అడ‌వి బిడ్డ‌ల అరణ్య రోద‌న వ‌ర్ణించ‌డం క‌ష్టం. అన్ని ఆదాయ‌మార్గాలు మూసుకుపోయిన నేప‌థ్యంలో వారికి గుప్పెడు మెతుకులు దొర‌క‌డం కూడా క‌ష్ట‌త‌రంగా మారింది. ప్ర‌భుత్వం ఇచ్చే నిత్యావ‌స‌రాల‌ను వారు నివాసం ఉంటోన్న‌ ప్రాంతాల‌కు చేర్చడం కూడా చాలా పెద్ద టాస్క్ అయ్యింది. ఈ నేప‌థ్యంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆక‌లితో పస్తులుంటోన్న‌ గిరిజనులకు నిత్యావసరాలను అందించేందుకు కదం తొక్కారు. కిలోమీటర్ల దూరం వాగులు, వంకలను దాటి నడుస్తూ…. రాళ్ల గుట్టలను ఎక్కుతూ ‌ఆమె మారుమూల ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలను సందర్శిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ వారికి నిత్యావసరాలను సరఫరా చేస్తున్నారు. గిరిజనులకు సాయం చేయడం కోసం ఆమె ప‌డుతోన్న క‌ష్టం ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

కాగా శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుపల్లి మండలంలోని గిరిజన ప్రాంతాల‌కు వెళ్లిన సీతక్కను పోలీసులు అడ్డుకున్నారు. నిత్యావసరాలను పంపిణీ చేయడానికి ప‌ర్మిష‌న్ లేద‌ని తె‌లిపారు. గిరిజన ప్రాంతాల నుంచి ఆమెను వెనక్కి వెళ్లమని సూచించారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu