ఆకట్టుకుంటున్న ‘బతుకు బస్టాండ్’ చిత్ర వీడియో గ్లింప్స్.. నెట్టింట వైరల్..

విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం అవుతున్న సినిమా బతుకు బస్టాండ్. నికిత అరోరా, శృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు

Rajeev Rayala

| Edited By: Balaraju Goud

Apr 20, 2021 | 8:43 AM

విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం అవుతున్న సినిమా బతుకు బస్టాండ్. నికిత అరోరా, శృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇలవల ఫిల్మ్స్ పతాకంపై చక్రధర్ రెడ్డి సమర్పణలో IN రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా బతుకు బస్టాండ్ టీమ్ విడుదల చేసిన ట్రిబ్యూట్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను కవితా రెడ్డి, కె.మాధవి నిర్మిస్తున్నారు. అలానే తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది. హీరో విరాన్, హీరోయిన్ నికిత అరోరా ఇద్దరు చాలా రొమాంటిక్ గా చేతులు పట్టుకుని కూర్చున్నారు. ఈ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా థీమ్ ని పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో కూడా సోషల్ మీడియాలో విశేష స్పందన తెచ్చుకుంటూ ముందుకు సాగుతుంది. థ్రిల్లింగ్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు దర్శకుడు IN రెడ్డి. ఈ సినిమాకు వాస్ కమల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మహవీర్ సంగీతం సమకూరుస్తున్నారు. జూన్ 11న ‘బతుకు బస్టాండ్’ సినిమా విడుదల కానుంది. ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియోను విడుదల చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

స్జేజ్ పై డ్యాన్స్ చేస్తూ కింద పడ్డ ప్రముఖ సింగర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

Sumitra Bhave: చిత్రపరిశ్రమలో మరో విషాదం… లెజండరీ డైరెక్టర్ సుమిత్ర భావే మృతి..

Karthika Deepam: కార్తీక్ నిజంగా మారాడా.. లేక జాలిపడుతున్నాడా అని ఆలోచిస్తున్న సౌందర్య.. మోనిత శనిలా పట్టుకుందన్న భాగ్యం

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu