Barber Shaving with Golden Razor : దేవుడా కరోనా ఎంతపని చేసింది..! కస్టమర్స్ కోసం బార్బర్.. బంగారం లాంటి ఐడియా..

పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. కస్టమర్స్ లేక ఇబ్బంది పడుతున్న తన వ్యాపారాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనుకున్నాడు ఓ వ్యక్తి.. తన బుర్రకు పదును పెట్టాడు ఓ బార్బర్ .. డిఫరెంట్ గా అలోచించాడు.. మళ్ళీ ఓ గోల్డెన్ ఐడియాతో...

Barber Shaving with Golden Razor  : దేవుడా కరోనా ఎంతపని చేసింది..! కస్టమర్స్ కోసం బార్బర్..  బంగారం లాంటి ఐడియా..
Follow us

|

Updated on: Mar 05, 2021 | 4:16 PM

Barber Shaving with Golden Razor : పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. కస్టమర్స్ లేక ఇబ్బంది పడుతున్న తన వ్యాపారాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనుకున్నాడు ఓ వ్యక్తి.. తన బుర్రకు పదును పెట్టాడు ఓ బార్బర్ .. డిఫరెంట్ గా అలోచించాడు.. మళ్ళీ ఓ గోల్డెన్ ఐడియా తో కరోనా వైరస్ తెచ్చిన కష్టాల నుంచి గట్టెక్కాలని భావించాడు.. వినియోగదారులను ఆకట్టుకోవాలంటే తన సెలూన్ షాప్ అందరి కంటే భిన్నంగా ఉండలని భావించాడు.. అంతే ఓ సరికొత్త గోల్డెన్ ఐడియా తో కస్టమర్స్ ను కట్టుకున్నాడు.. ఇప్పుడు ఆ షాప్ లో నిత్యం సందడి నెలకొంది. మరి ఆ సక్సెస్ ఫుల్ ఐడియా ఏంటో తెలుసా బంగారంతో తయారు చేసిన రేజర్.. వివరాల్లోకి వెళ్తే..

మహారాష్ట్రలోని పూణే లో సెలూన్ షాప్ యజమాని అవినాష్ బోరుండియా అందరిలానే కరోనా కష్టాల కోరల్లో చిక్కుకున్నాడు. తన సెలూన్ కి కష్టమర్స్ ను ఆకర్షించాలంటే తన షాపు అన్ని షాప్స్ కంటే డిఫరెంట్ గా ఉండాలనుకున్నాడు. అంతేకాదు తాను కట్టింగ్ చేసే రేజర్ కూడా డిఫరెంట్ గా ఉండాలనుకున్నాడు. ఏకంగా రేజన్ ను బంగారంతో తయారు చేయించాడు. బంగారపు రేజర్ తో షేవింగ్ చేయించుకోవటానికి కష్టమర్లు బాగా వస్తున్నారని చెప్పుకొస్తున్నాడు పూణేకు చెందిన అవినాష్ బోరుండియా అనే బార్డర్.

కస్టమర్లను ఆకట్టుకోవటానికి అవినాష్‌ 80 గ్రామల బంగారంతో రేజర్‌ తయారు చేయించాడు. దీని కోసం రూ.4 లక్షలు ఖర్చు కూడా పెట్టాడు. ఇక షాప్ ను కూడా అందంగా అలంకరించాడు. రీమోడల్ చేసిన తర్వాత స్థానిక బీజేపీ ఎమ్మెల్యే గోపీచంద్ పద్వాకర్‌తో ఇటీవల సెలూన్‌ షాపును పునఃప్రారంభించాడు.

తర్వాత తన షాప్ కి వచ్చే కస్టమర్స్ కు మంచి కాలక్షేపంతో పాటు గోల్డెన్‌ రేజర్‌తో కట్టింగ్, షేవింగ్ చేస్తామంటూ ప్రచారం కూడా చేశాడు. బంగారపు రేజర్ తయారీ గురించి అవినాష్ మాట్లాడుతూ..తన షాపుకు కస్టమర్ల సంఖ్య పెరుగుతోందని సంతోషం వ్యక్తంచేశాడు అవినాష్‌. బంగారం రేజర్‌తో గడ్డం చేయటానికి రూ.100 తీసుకుంటున్నానని చెప్పాడు. అయితే కొంతమంది రూ. 100 ఇవ్వడం లేదని అయినా వారి సంతోషం కోసం షేవ్ చేస్తున్నానంటూ చెప్పాడు అవినాష్

Also Read:

 రిసార్ట్ లో కల్లు తాగిన సింగర్ సునీత ..! సోషల్ మీడియాలో ఫోటో వైరల్

ఏ దేవుడికి ఏ పువ్వులంటే ఇష్టం.. పుష్పాలతో పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసా..!