బాబు ఓకే అంటే టీడీపీని నడిపించేందుకు శ్రీ భరత్ సిద్దమా?

బాబు ఓకే అంటే టీడీపీని నడిపించేందుకు శ్రీ భరత్ సిద్దమా?
TDP Crisis

శ్రీభరత్..నందమూరి బాలకృష్ణ  కుమార్తె  తేజస్విని భర్త. కావూరి సాంబశివరావు కూతురి కొడుకు. గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు దివంగత ఎంవీవీఎస్ మూర్తిగారి మనవడు. ఇంత పొలిటికల్, సినీ బ్యాగ్రౌండ్ ఈ యువ నాయకుడి సొంతం.  గత ఎన్నికల వరకు ఇతడు పెద్దగా ఎవరికి పరిచయం లేదు. తనకున్న బలం, బలంగంతో అనూహ్యంగా విశాఖ టీడీపీ ఎంపీగా పోటీ చేసి వార్తకెక్కాడు  జగన్ స్వింగ్‌లో కూడా గట్టి పోటీని ఇచ్చి స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు. ఆ […]

Ram Naramaneni

|

Aug 30, 2019 | 9:02 PM

శ్రీభరత్..నందమూరి బాలకృష్ణ  కుమార్తె  తేజస్విని భర్త. కావూరి సాంబశివరావు కూతురి కొడుకు. గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు దివంగత ఎంవీవీఎస్ మూర్తిగారి మనవడు. ఇంత పొలిటికల్, సినీ బ్యాగ్రౌండ్ ఈ యువ నాయకుడి సొంతం.  గత ఎన్నికల వరకు ఇతడు పెద్దగా ఎవరికి పరిచయం లేదు. తనకున్న బలం, బలంగంతో అనూహ్యంగా విశాఖ టీడీపీ ఎంపీగా పోటీ చేసి వార్తకెక్కాడు  జగన్ స్వింగ్‌లో కూడా గట్టి పోటీని ఇచ్చి స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న భరత్ తాజాగా ఇటీవల టీవీ9తో జరిగిన ముఖాముఖిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదన్న భరత్…ఒక వేళ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలంటే..అధినేత చంద్రబాబుతో చర్చించి రావాలంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం భరత్ వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఘోర పరాజయాన్ని ఎదుర్కోంది. దీంతో  పార్టీని బతికించాలంటే సీనియర్ ఎన్టీఆర్ మనవడు, విపరీతమైన ప్రజాదారణ ఉన్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీని అప్పగించాలని డిమాండ్లు వినిపించాయి. ఎన్టీఆర్‌ ముందు చంద్రబాబు తనయుడు లోకేశ్ సరితూగరనే ప్రచారం భారీగా జరుగుతోంది. ఎన్టీఆర్‌ కూడా గత ఎన్నికల్లో టీడీపీ తరుపున ప్రచారానికి రాలేదు. ఇటు పార్టీ వర్గాల నుంచి కూడా పిలుపు అందలేదు. ప్రస్తుతం స్టార్ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలుగుతున్న ఎన్టీఆర్ కొంతకాలం వరకు రాజకీయాల జోలికి రారని అతని సన్నిహితుల నుంచి వినిపిస్తోన్న మాట.

మరి ఇప్పుడు పార్టీని నడపించేది ఎవరు:

శ్రీ భరత్..ఈ పేరు ఇప్పుడు మారిమోగిపోతోంది. విదేశాల్లో పెరిగినా కూడా చెక్కుచెదరని క్యాడ‌ర్‌ని వారి ఇద్దరు తాతలు అందించారు. మరోవైపు మాట్లాడే పద్దతిలో కావొచ్చు, స్పీచ్‌ల విషయంలోను, అధికార పార్టీపై విమర్శలు చేయడంలోనూ భరత్ కొత్త పంథాను అనుసరిస్తున్నాడు. యువ నాయకులతో, టాలెంట్‌తో కొత్త ఆలోచనలు చేయగలిగితే పార్టీని బిల్డ్ చేసుకోవచ్చు అంటూ పార్టీ బలంగా పుంజుకోవడానికి ఆలోచనలను వ్యక్తపరుస్తున్నాడు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనతో పాటూ 294మంది.. జూనియర్ ఎన్టీఆర్‌లా తెలిసినవారు కాదు , చరిష్మా ఉన్న నాయకులు కాదు అయినా 200మంది 30 ఏళ్లలోపు ఉన్నవాళ్లు, కొత్తవాళ్లు పార్టీని నడిపించారు కదా .. పలానా వ్యక్తి వస్తేనే పార్టీకి బలం అనడం సరికాదంటూ భరత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల పట్ల అతడి పరిణితిని తెలియజేస్తున్నాయి.

మరి జూనియర్ ఎన్టీఆర్ వచ్చేవరకు, లోకేశ్ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా మారేలోపు శ్రీ భరత్ తెలుగుదేశాన్ని ముందుకు నడిపిస్తాడేమో మున్ముందు చూడాలి. మరి దీనికి నారా, నందమూరి అభిమానులు ఏమంటారో..బాబు ఎలాంటి సంకేతాలిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu