‘బాహుబలి-2’ని మించిన బ్లాక్ బ‌స్ట‌ర్.. బిగ్‌బీ సంచలన వ్యాఖ్యలు

బాహుబలి మూవీపై ఒక సెన్సిటివ్ కామెంట్ చేశారు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. ఆ సినిమా వసూళ్ల విషయంలో కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఒక్కమాటతో తీసిపడేశారు. 43 ఏళ్ల కిందట రిలీజైన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ మూవీ కలెక్షన్లను గుర్తు చేసుకున్నారు. తనతో పాటు వినోద్‌ఖన్నా, రిషికపూర్‌ హీరోలుగా నటించిన ఆ మూవీ.. అప్పట్లోనే ఏడు కోట్ల 25 లక్షలు వసూలు చేసిందని అన్నారు. ఆల్‌టైమ్ స్మాష్ రికార్డ్ అనే పోస్టర్‌ని కూడా తన ట్వీట్‌లో పెట్టారు […]

  • Sanjay Kasula
  • Publish Date - 4:05 pm, Wed, 27 May 20
'బాహుబలి-2'ని మించిన బ్లాక్ బ‌స్ట‌ర్.. బిగ్‌బీ సంచలన వ్యాఖ్యలు

బాహుబలి మూవీపై ఒక సెన్సిటివ్ కామెంట్ చేశారు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. ఆ సినిమా వసూళ్ల విషయంలో కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఒక్కమాటతో తీసిపడేశారు. 43 ఏళ్ల కిందట రిలీజైన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ మూవీ కలెక్షన్లను గుర్తు చేసుకున్నారు. తనతో పాటు వినోద్‌ఖన్నా, రిషికపూర్‌ హీరోలుగా నటించిన ఆ మూవీ.. అప్పట్లోనే ఏడు కోట్ల 25 లక్షలు వసూలు చేసిందని అన్నారు. ఆల్‌టైమ్ స్మాష్ రికార్డ్ అనే పోస్టర్‌ని కూడా తన ట్వీట్‌లో పెట్టారు బిగ్‌. అక్కడితో ఆగకుండా.. అదే ఫిగర్‌ని ఇప్పటికి లెక్క గడితే బాహుబలి కలెక్షన్లను కూడా దాటిపోతుందని అంటూ వివరణ ఇచ్చారు. ఆ సినిమా షూటింగ్ సెట్‌లోని ఫోటో ఒక‌టి షేర్ చేస్తూ.. బాక్సాఫీస్ గ‌ణాంకాల‌ని షేర్ చేసుకున్నారు.

రాజమౌళి డైరెక్ట్ చేసిన ‘బాహుబలి-2′ మూవీ వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. మరే బాలీవుడ్ మూవీ కూడా టచ్ చేయలేనంత స్థాయి అనే ప్రచారం జరిగింది. ఒక నాన్‌-హిందీ మూవీ ఇంత ఘనతకెక్కడం నార్త్ ఇండస్ట్రీ ఇగోని కూడా దెబ్బతీసింది. కానీ.. ఇప్పుడు అమితాబ్‌ బచ్చన్ చేసిన ఈ కామెంట్‌.. వసూళ్ల లెక్కల్ని కదిపినట్లు అయ్యింది.

1977లొ విడుదలైన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఆ సంవత్సరంలో బిగ్గెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, రిషి కపూర్, వినోద్ ఖన్నా, షబానా అజ్మీ, నీతూ కపూర్, ప్రాణ్, పర్వీన్ బాబీ నటించారు. మన్మోహన్ దేశాయ్ దర్శకత్వం వహించగా, ఖాదర్ ఖాన్ డైలాగులు అందించారు.

 

View this post on Instagram

 

SHWETA and Abhishek visit me on set of Amar Akbar Anthony .. shooting song ‘My name is Anthony Gonsalves’ .. at Holiday Inn Ball Room .. this pic on the beach front .. 43 YEARS of AAA , today .. !!! When Man ji came to narrate the idea to me .. and told me the Title .. I thought he had lost it .. at a time in the 70’s when film titles revolved around Behen Bhabhi and Beti , this one was so out of place .. BUT .. It is reported that it did a business of 7.25 cr at that time .. inflation adjusted it crosses collections of Bahubali 2 .. say the sayers who do calculations 😟😟 But fact is it did massive business .. did 25 weeks in 25 theatres in Mumbai alone .. or so they say .. Doesn’t happen now … gone are those days !!

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on