ఆజంఖాన్ అపాలజీ.. క్షమించేది లేదన్న బీజేపీ ఎంపీ

ఎట్టకేలకు ఎస్పీ ఎంపీ ఆజంఖాన్ మహిళా ఎంపీలకు క్షమాపణలు చెప్పారు. కానీ తనను క్షమించేది లేదని బీజేపీ ఎంపీ రమాదేవి అన్నారు. గురువారం స్పీకర్ స్థానంలో ఉన్న ఎంపీ రమాదేవిపై ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీశాయి. దీంతో సభలో గందరగోళం మొదలైంది. అధికార పార్టీ బీజేపీతో సహా అన్ని పక్షాల నుంచి నిరసన వ్యక్తమైంది. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలంటూ విపక్షాలు సభలోనే డిమాండ్ చేస్తూ.. స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ఈ నేపథ్యంలో ఆయన.. […]

ఆజంఖాన్ అపాలజీ.. క్షమించేది లేదన్న బీజేపీ ఎంపీ
Follow us

| Edited By:

Updated on: Jul 29, 2019 | 12:40 PM

ఎట్టకేలకు ఎస్పీ ఎంపీ ఆజంఖాన్ మహిళా ఎంపీలకు క్షమాపణలు చెప్పారు. కానీ తనను క్షమించేది లేదని బీజేపీ ఎంపీ రమాదేవి అన్నారు. గురువారం స్పీకర్ స్థానంలో ఉన్న ఎంపీ రమాదేవిపై ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీశాయి. దీంతో సభలో గందరగోళం మొదలైంది. అధికార పార్టీ బీజేపీతో సహా అన్ని పక్షాల నుంచి నిరసన వ్యక్తమైంది. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలంటూ విపక్షాలు సభలోనే డిమాండ్ చేస్తూ.. స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ఈ నేపథ్యంలో ఆయన.. ఆజంఖాన్‌ను తన ఛాంబర్‌కు పిలిపించుకుని మాట్లాడారు. అనంతరం సభలో ఆజంఖాన్ క్షమాపణలు చెప్పారు.

అయితే ఆజంఖాన్‌ను ఎట్టి పరిస్థితిల్లోనూ క్షమించేది లేదని రమాదేవి తెగేసి చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దేశాన్ని దేశంలోని మహిళలందర్నీ గాయాపరిచాయన్నారు. గతంలో కూడా మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని.. అయినా ఎప్పుడూ అతనిలో మార్పు కనిపించదన్నారు. ఇప్పటికైనా.. తన అలవాటును మార్చుకోవాలని.. నోటికి ఎది వస్తే అది మాట్లాడడం కాదన్నారు.