రాజీతో ఉండదేమో పేచీ.. “మూడు రోజుల్లో” అయోధ్య వివాదానికి తెర..?

దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య వివాదం కేసు పై సుప్రీం కోర్డులో వాదనలు బుధవారంతో ముగిసాయి. 1992 డిసెంబర్ 6వ తేదీన వివాదాస్పద మసీదును కూల్చివేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టుకు చేరిన అయోధ్య వివాదం దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చింది. అయోధ్య కేసులో బుధవారం జరిగిన తుది విచారణలో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విచారణ జరుగుతున్న సమయంలో అయోధ్య రీవిజిటెడ్ పేరుతో రాసిన పుస్తకాన్ని.. అందులో కీలకమైన ఓ మ్యాప్‌ని ప్రదర్శించడం సున్నీ వక్ఫ్ […]

రాజీతో ఉండదేమో పేచీ.. మూడు రోజుల్లో అయోధ్య వివాదానికి తెర..?
Follow us

|

Updated on: Oct 17, 2019 | 2:00 PM

దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య వివాదం కేసు పై సుప్రీం కోర్డులో వాదనలు బుధవారంతో ముగిసాయి. 1992 డిసెంబర్ 6వ తేదీన వివాదాస్పద మసీదును కూల్చివేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టుకు చేరిన అయోధ్య వివాదం దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చింది. అయోధ్య కేసులో బుధవారం జరిగిన తుది విచారణలో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విచారణ జరుగుతున్న సమయంలో అయోధ్య రీవిజిటెడ్ పేరుతో రాసిన పుస్తకాన్ని.. అందులో కీలకమైన ఓ మ్యాప్‌ని ప్రదర్శించడం సున్నీ వక్ఫ్ బోర్డు తరపు న్యాయవాది రాజీవ్ ధావన్ చించివేశారు. అంతే కాకుండా 1986లో ముద్రించిన పుస్తకాన్ని రికార్డుల్లోకి తీసుకోవద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అసహనం చెందిన చీఫ్ జస్టిస్.. వాదనలు ఇలాగే కొనసాగితే మధ్యలో నుంచి వెళిపోతానని చెప్పారు. ఇరువురి వాదనలు విన్న చీఫ్ జస్టిస్.. ఈ వివాదం పై ఇరువర్గాలు చర్చించుకుని ఎవరైనా కాంప్రమైజ్‌కి రావచ్చని.. అందుకు 3 రోజులు సమయం కేటాయిస్తూ తీర్పు వెల్లడించారు.

త్వరలోనే రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం పై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఎవరైనా రిటన్ స్టేట్ మెంట్ ఇవ్వాలనుకుంటే మూడు రోజులలోగా కోర్టుకు వివరించాల్సిందిగా చీఫ్ జస్టిస్ తెలిపారు. కాగా, వివాదాస్పద స్థలం పై హక్కులను వదులుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని సున్నీ వక్ఫ్ బోర్డు సంసిద్ధత వ్యక్తం చేసి.. ఆ తర్వాత వెనక్కి తగ్గింది. ఒకవేళ హక్కులు వదులుకోవాల్సి భవిష్యత్తులో మరే మసీదు మీద ఇలాంటి వివాదం రాజేయమని హిందూ సంఘాలు హామీ ఇవ్వాలని సున్నీ వక్ఫ్ బోర్డు కండీషన్ విధించింది.

కాగా, గతంలో ఈ వివాదాస్పద స్థలంలో టెంపుల్ కట్టుకోవచ్చు అనే నిర్ణయాన్ని కోర్టు ప్రకటిస్తుందని అందరూ భావించారు. ఏ కమ్యూనిటీకి నష్టం జరగకుండా కోర్టు తీర్పు ఇవ్వాలనుకుంది. ఎలాంటి గొడవలు జరగకుండా.. సామరస్య పూర్వకంగా ఇరు మతాల వారు చర్చించుకుని ఈ వివాదాన్ని పరిష్కరించుకుంటే మంచిదని కోర్టు తెలియజేసింది. ముస్లింలు కాంప్రమైజ్ అయితే వారి షరతులు తీర్చడానికి హిందూ సంఘాలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కోర్టు ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకుంటే దేశానికి మంచి పేరు వస్తుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. అసలు కోర్టు నిర్ణయించాల్సింది అక్కడ వున్న 2.77 ఎకరాల భూమి ఎవరికి చెందుతుంది అనేదే కాని, అక్కడ గుడి నిర్మించాలా, మసీదు నిర్మించాలా అనేది కోర్టు నిర్ణయం కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి ఈ వివాదం పరిష్కారం కావడానికి ఈ మూడు రోజులు (అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 19) కీలకంగా మారాయి. కోర్టు తీర్పు ప్రకారం హిందూ సంఘాలు తమ నిర్ణయాన్ని లిఖిత పూర్వకంగా తెలియజేయాలి. ఇక సున్నీ వక్ఫ్ బోర్టు సభ్యులు కూడా తమ నిర్ణయాన్ని లిఖిత పూర్వకంగా మధ్యవర్తిత్వ కమిటీకి అందజేయాల్సి ఉంది. దీన్ని పరిశీలించిన తర్వాత కోర్టు తీర్పు ప్రకటించనుంది. మొత్తానికి ఇంకో మూడు రోజుల తర్వాత అయోధ్య వివాదానికి తెర పడుతుందని యావత్ ప్రజలు ఆశిస్తున్నారు.

మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!