US visa: భారతీయులు అమెరికా వెళ్లాలంటే 2024 వరకు ఆగాల్సిందే.. విజిటింగ్‌ వీసాలకు విపరీతమైన డిమాండ్‌

అమెరికా విజిటింగ్‌ వీసా కోసం ఏడాదిన్నర కాలం పాటు వేచి ఉండాల్సిందే..కోవిడ్‌ ఆంక్షలు ఎత్తేసిన తరువాత భారతీయులు అక్కడికి పోటీ పడి వెళ్తున్నారు.

US visa: భారతీయులు అమెరికా వెళ్లాలంటే 2024 వరకు ఆగాల్సిందే..  విజిటింగ్‌ వీసాలకు విపరీతమైన డిమాండ్‌
Visa
Follow us

|

Updated on: Aug 18, 2022 | 8:01 PM

అమెరికా వీసాల కోసం మళ్లీ కష్టాలు పెరిగాయి. విజిటర్‌ వీసా కావాలంటే భారతీయులు 2024 వరకు ఆగాల్సిందే. కోవిడ్‌ ఆంక్షలను ఎత్తేయడం , ఇంటర్నేషనల్‌ విమానాల రాకపోకలు పెరగడంతో అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అమెరికా వీసా కావాలంటే భారతీయులు 500 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లే వాళ్లు లోని యూఎస్‌ కాన్సులేట్‌లో విజిటింగ్‌ వీసా కోసం 582 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. స్టూడెంట్‌ వీసాల కైతే ఢిల్లీలో 471 క్యాలెండర్‌ దినాలను నిర్ణయించారు. ముంబై పౌరులు అమెరికా విజిటింగ్‌ వీసా కోసం 517 రోజులు వేచి ఉండాలి. విద్యార్ధుల కైతే 10 రోజుల్లో స్టూడెంట్‌ వీసాలు లభిస్తాయి.

హైదరాబాద్‌ వాసులకు కూడా అమెరికా వీసాను సాధించడం కష్టంగా మారింది. విజిటింగ్‌ వీసాకు హైదరాబాద్‌ వాసులు 518 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి. విద్యార్ధులు స్టూడెంట్‌ వీసా కోసం 479 రోజులు వేయిట్‌ చేయాలి. కోల్‌కతా వాసులు అమెరికా విజిటింగ్‌ వీసాల కోసం 587 రోజులు వేయిట్‌ చేయాలి. విద్యార్ధులకు మాత్రం రెండు రోజుల్లో స్టూడెంట్ వీసాలు లభిస్తాయి. చెన్నై నుంచి అమెరికా వెళ్లే వాళ్లు విజిటింగ్‌ వీసా కోసం 513 వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. విద్యార్ధుల కైతే 8 రోజుల్లో స్టూడెంట్‌ వీసా లభిస్తుంది. కోవిడ్‌ కారణంగా చాలా దేశాల్లో అమెరికా కాన్సులేట్లు వీసాను ఇవ్వడం చాలారోజుల పాటు ఆపేశాయి. గత కొద్దినెలల నుంచి మాత్రం ఈ ఆంక్షలను ఎత్తేశారు. ప్రతి ఏటా భారత్ నుంచి వేలాదిమంది అమెరికాకు వెళ్తుంటారు. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి తక్కువ మందే ప్రయాణాలు చేస్తున్నారు. అయితే కొద్దిరోజుల క్రితమే కోవిడ్‌ ఆంక్షలను సడలించారు. దీంతో విద్యార్ధులతో పాటు అమెరికాలో స్థిరపడ్డ వాళ్ల బంధువులు కూడా అక్కడికి వెళ్లడానికి క్యూ కడుతున్నారు. దీంతో విజిటింగ్‌ వీసాలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. అందుకే అమెరికా విజిటింగ్‌ వీసా కోసం 500 రోజులు వేయిట్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!