ఈ చిన్న టెక్నీక్ తో.. సేవింగ్స్ ఖాతాపై డబుల్ వడ్డీ.!

Auto Sweep Facility: ఆటో స్వీప్ ఫెసిలిటీ… ఈ పేరు కొంచెం కొత్తగా ఉందేంటని అనుకుంటున్నారా.? ఇది సేవింగ్స్ ఖాతాలో ఉండే ఒక సదుపాయం. చాలామంది కస్టమర్లకు ఈ విధానం గురించి అసలు తెలియదు. అయితే ఇప్పుడు ఈ ఫెసిలిటీ ద్వారా మీరు ఎక్కువ వడ్డీ పొందే అవకాశం ఉంది. సాధారణంగా బ్యాంకులు మన సేవింగ్స్ ఖాతాలో ఉండే డబ్బులకు 3 నుంచి 4 శాతం వరకు వడ్డీ ఇస్తాయి. అయితే దాని కంటే డబుల్ వడ్డీ […]

ఈ చిన్న టెక్నీక్ తో.. సేవింగ్స్ ఖాతాపై డబుల్ వడ్డీ.!

Auto Sweep Facility: ఆటో స్వీప్ ఫెసిలిటీ… ఈ పేరు కొంచెం కొత్తగా ఉందేంటని అనుకుంటున్నారా.? ఇది సేవింగ్స్ ఖాతాలో ఉండే ఒక సదుపాయం. చాలామంది కస్టమర్లకు ఈ విధానం గురించి అసలు తెలియదు. అయితే ఇప్పుడు ఈ ఫెసిలిటీ ద్వారా మీరు ఎక్కువ వడ్డీ పొందే అవకాశం ఉంది. సాధారణంగా బ్యాంకులు మన సేవింగ్స్ ఖాతాలో ఉండే డబ్బులకు 3 నుంచి 4 శాతం వరకు వడ్డీ ఇస్తాయి. అయితే దాని కంటే డబుల్ వడ్డీ పొందాలంటే మాత్రం మీకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. అసలు ఈ ఆటోస్వీప్ అంటే ఏమిటి.? దాని వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ సేవింగ్స్ అకౌంట్‌లో అవసరానికి మించి ఉన్న డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోకి మళ్లించి ఎక్కువ వడ్డీ పొందేందుకు ఈ ఆటోస్వీప్ ఫెసిలిటీ సహాయపడుతుంది. ఉదాహరణకు మీ అకౌంట్‌లో లక్ష రూపాయలు ఉంటే.. అందులో మీకు రూ. 25,000 అవసరమైతే.. మిగిలిన రూ.75,000లను ఆటోస్వీప్ ఫెసిలిటీ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు మళ్లించవచ్చు. ఇక ఆ ఫిక్స్‌డ్ డిపాజిట్‌‌లోకి మళ్ళిన డబ్బుల ద్వారా డబుల్ వడ్డీ పొందవచ్చు. ఈ ఆటోస్వీప్ ఆప్షన్ ద్వారా రూ.25,000 నుంచి రూ.1 లక్ష వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లలోకి మళ్లించవచ్చు. అంతేకాకుండా మీకు ఒకవేళ మధ్యలో డబ్బులు అవసరమైన కూడా డ్రా చేసుకునే సదుపాయం ఉంది.

సేవింగ్స్ అకౌంట్‌లో చాలాకాలంగా డబ్బులు ఉన్నవారికి ఈ ఫెసిలిటీ ఎక్కువగా ఉపయోగపడుతుంది. మీకు కూడా మీ సేవింగ్స్ ఖాతాలో ఉన్న అమౌంట్ ప్రస్తుతానికి అవసరం లేకపోతే ఈ ఆప్షన్‌ను ట్రై చేసి డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోకి మార్చుకోండి. ఇక డిపాజిట్ చేసిన డబ్బులకు వడ్డీ ఏడాదికి లెక్కేస్తారు.

ఇదిలా ఉంటే కనీసం 30 రోజులు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో డబ్బులు ఉంచాలన్న నిబంధనలు కూడా కొన్ని బ్యాంకుల్లో ఉండటం గమనార్హం. ఒకవేళ ఆలోపు డబ్బులు డ్రా చేస్తే మాత్రం ప్రీ- మెచ్యూర్ విత్‌డ్రాయల్ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆటోస్వీప్ ఆప్షన్‌లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్.. ఇది దీర్ఘకాలంగా ఎఫ్‌డీలో డబ్బులు జమ చేసేవారి కోసం.. మరొకటి ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్.. ఇది తరచూ డబ్బులు తీసుకునే, వేసుకునేవారి కోసం ఉపయోగపడుతుంది. ఇక ఆటోస్వీప్ ద్వారా మీ డబ్బుపై గరిష్టంగా 8శాతం వరకు వడ్డీ పొందవచ్చు.

ఈ ఆటోస్వీప్ ఆప్షన్ గురించి తెలుసుకోవాలంటే.. మీ అకౌంట్ ఉన్న బ్యాంక్‌కు వెళ్లి అక్కడ అధికారులను అడగండి. లేదా బ్యాంక్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో దీని గురించి వివరాలు ఉంటాయి. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి.

Published On - 4:21 pm, Wed, 5 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu