ఆస్ట్రేలియన్ క్రికెటర్‌కు గాయం.. ఇంగ్లాండ్ కౌంటీలకు దూరం..

Australian Wicket Keeper: ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ గాయం కారణంగా ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని సోమర్‌సెట్ ఇంగ్లీష్ కౌంటీ క్లబ్ అధికారికంగా వెల్లడించింది. ఈ సీజన్‌లో సొమర్‌సెట్ తరపున ఆడనున్న వేడ్ తాజాగా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. గాయం తీవ్రతరం కావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా అతడ్ని కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. ఇక ఈ విషయంపై సోమర్‌సెట్ డైరెక్టర్ ఆండీ హుర్రి మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో తమ […]

ఆస్ట్రేలియన్ క్రికెటర్‌కు గాయం.. ఇంగ్లాండ్ కౌంటీలకు దూరం..
Ravi Kiran

|

Mar 19, 2020 | 1:21 PM

Australian Wicket Keeper: ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ గాయం కారణంగా ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని సోమర్‌సెట్ ఇంగ్లీష్ కౌంటీ క్లబ్ అధికారికంగా వెల్లడించింది. ఈ సీజన్‌లో సొమర్‌సెట్ తరపున ఆడనున్న వేడ్ తాజాగా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. గాయం తీవ్రతరం కావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా అతడ్ని కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించింది.

ఇక ఈ విషయంపై సోమర్‌సెట్ డైరెక్టర్ ఆండీ హుర్రి మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో తమ జట్టు తరపున వేడ్ ఆడకపోవడం చాలా బాధాకరమని.. అయితే గాయాలు కూడా ఆటలో భాగం కావడంతో సర్దుకుపోవాలని తెలిపారు. వేడ్ ఓ అద్భుతమైన బ్యాట్స్‌‌‌‌‌‌మెన్, వికెట్ కీపర్ అని కొనియాడారు.

కాగా, ఆస్ట్రేలియన్ సమ్మర్, యాషెస్ సిరీస్‌లలో మాథ్యూ వేడ్ అద్భుతంగా రాణించాడు. ఇంగ్లాండ్‌లో జరిగిన యాషెస్ సిరీస్‌లో అతడు ఐదు టెస్టులకు 337 పరుగులు చేసి మంచి ఫామ్ కనబరిచాడు. కాగా, కెరీర్‌లో 32 టెస్టుల్లో ఆడిన వేడ్ 1400 పరుగులు చేశాడు.

For More News:

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…

ఫ్లాష్ న్యూస్: కరోనా ప్రభావం.. సీబీఎస్ఈ, జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా..

Breaking: తెలంగాణలో ఒక్క రోజులోనే 8 కరోనా పాజిటివ్ కేసులు..

కరోనా ఎఫెక్ట్.. ఒకేసారి ఆరు నెలల రేషన్ సరుకులు…

Breaking: ఏపీలో రెండో కరోనా పాజిటివ్ కేసు..

కరోనా భయం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు వేల కోళ్లు సజీవ సమాధి..

కరోనా అలెర్ట్.. ఏపీ, తెలంగాణలకు ప్రత్యేక నోడల్ అధికారులు..

ఫ్లాష్: సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు వాయిదా.. త్వరలోనే కొత్త తేదీలు ప్రకటన

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu