ఆస్ట్రేలియా, విండీస్ టీ20 సిరీస్ వాయిదా..

టీ20 ప్రపంచకప్ సన్నాహక సిరీస్‌గా అక్టోబర్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన టీ20 సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది.

ఆస్ట్రేలియా, విండీస్ టీ20 సిరీస్ వాయిదా..

Australia West Indies T20 Series: కరోనా వైరస్ అన్నింటిని మార్చేసింది. అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లు, టోర్నీలు పూర్తిగా వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్ సన్నాహక సిరీస్‌గా అక్టోబర్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన టీ20 సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. విండీస్ క్రికెట్ బోర్డుతో చర్చించిన తర్వాతే తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు సీఏ పేర్కొంది.

వాస్తవానికి ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య ఆస్ట్రేలియా వేదిక అక్టోబర్ 4, 6, 9 తేదీల్లో మూడు టీ20 మ్యాచులు జరగాల్సి ఉన్నాయి. అయితే కరోనా వైరస్ విజృంభణతో ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వచ్చే సంవత్సరానికి వాయిదా పడటంతో పాటుగా.. ఐపీఎల్ కూడా అదే సమయంలో జరగనుండటంతో ఈ సిరీస్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ నెలలో పరిమితి ఓవర్లలో సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ వెళ్లాల్సి ఉంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Also Read:

గుడ్ న్యూస్.. కరోనా మందు ‘ఫావిపిరవిర్‌’.. కేవలం రూ. 35కే..

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

మహిళలకు గుడ్ న్యూస్.. ఆగష్టు 12న ‘వైఎస్ఆర్ చేయూత’కు శ్రీకారం..

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూత..

Click on your DTH Provider to Add TV9 Telugu