ధోనినే ది బెస్ట్: గిల్‌క్రిస్ట్

మహేంద్రసింగ్ ధోని... ఈ పేరు క్రికెట్ ప్రపంచానికి సుపరిచితమే. తన వైవిధ్యమైన ఆటతీరుతో.. కూల్ కెప్టెన్సీతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

ధోనినే ది బెస్ట్: గిల్‌క్రిస్ట్

Adam Gilchrist Praises MS Dhoni: మహేంద్రసింగ్ ధోని… ఈ పేరు క్రికెట్ ప్రపంచానికి సుపరిచితమే. తన వైవిధ్యమైన ఆటతీరుతో.. కూల్ కెప్టెన్సీతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. భారత్ జట్టుకు ఎన్నో అపురూపమైన విజయాలను అందించాడు. ధోనిని అభిమానులు మాత్రమే కాదు.. ఎంతోమంది మాజీ క్రికెటర్లు, దిగ్గజాలు ఇష్టపడతారు. వికెట్ల వెనుక కూల్‌గా ఉంటూ.. క్లిష్ట పరిస్థితుల్లో కూడా జట్టును విజయతీరాలకు చేర్చడంలో ధోనిది అందవేసిన చెయ్యి. ఈ క్రమంలోనే తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు.

క్రికెట్‌లో ఎంతోమంది అద్భుతమైన కీపర్లు ఉన్నా తన ఓటు మాత్రం ధోనీకేనని గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. ‘ప్రపంచంలో ఉత్తమ కీపర్ ఎవరంటే నేను ధోనినే ఎంచుకుంటా. నా దృష్టిలో ధోని అగ్రస్థానంలో ఉంటాడు. అతడి స్టైల్. అభిమానుల అంచనాలను అందుకుంటూ అతడు ఆడే విధానం ఎంతో ప్రత్యేకం. ఇక ధోని తర్వాత స్థానాల్లో సంగక్కర, మెక్‌కలమ్‌, బౌచర్‌లు ఉంటారు. కాగా, భారత క్రికెట్‌పై ధోని ప్రభావం ఎంతోకాలం ఉంటుందని గిల్లి వివరించాడు.

Click on your DTH Provider to Add TV9 Telugu