యూపీలో దుమ్ము తుఫాను: 19 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో దుమ్ము తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాను దాటికి ఇప్పటికే 19 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 48 మంది గాయపడ్డారు. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. అత్యధికంగా మొయిన్‌పురిలో ఆరుగురు, ఇతాలో ముగ్గురు, కస్‌గంజ్‌లో ముగ్గురు, మోరదాబాద్‌, బదౌన్‌, పిలిభిత్‌, మధుర, కన్నౌజ్‌, సాంభల్‌, ఘజియాబాద్‌లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఒక్క మొయిన్‌పురిలోనే 41 మంది గాయపడ్డారు. తుపాను కారణంగా ఎనిమిది పశువులు కూడా మరణించినట్లు అధికారులు తెలిపారు. తాజా […]

యూపీలో దుమ్ము తుఫాను: 19 మంది మృతి
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2019 | 2:55 PM

ఉత్తరప్రదేశ్‌లో దుమ్ము తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాను దాటికి ఇప్పటికే 19 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 48 మంది గాయపడ్డారు. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. అత్యధికంగా మొయిన్‌పురిలో ఆరుగురు, ఇతాలో ముగ్గురు, కస్‌గంజ్‌లో ముగ్గురు, మోరదాబాద్‌, బదౌన్‌, పిలిభిత్‌, మధుర, కన్నౌజ్‌, సాంభల్‌, ఘజియాబాద్‌లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఒక్క మొయిన్‌పురిలోనే 41 మంది గాయపడ్డారు. తుపాను కారణంగా ఎనిమిది పశువులు కూడా మరణించినట్లు అధికారులు తెలిపారు. తాజా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. తుపాను బాధితులకు సాయం అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.