నిరాశ చెందాల్సిన అవసరం లేదు: ఆక్స్‌ఫర్డ్‌ టీకా నిలిపివేతపై డబ్ల్యూహెచ్‌ఓ

వ్యాక్సిన్‌ తీసుకున్న ఓ రోగికి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే

  • Tv9 Telugu
  • Publish Date - 1:47 pm, Fri, 11 September 20
నిరాశ చెందాల్సిన అవసరం లేదు: ఆక్స్‌ఫర్డ్‌ టీకా నిలిపివేతపై డబ్ల్యూహెచ్‌ఓ

Oxford Vaccine trails: వ్యాక్సిన్‌ తీసుకున్న ఓ రోగికి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఇది ఒక మేల్కొలుపు మాత్రమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్లినికల్ ట్రయల్స్‌లో హెచ్చు తగ్గులు ఉంటాయనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఇలాంటి వాటికి మరింత సిద్ధంగా ఉండాలని ఆమె వెల్లడించారు. ఇక దీనిపై పరిశోధకులు కూడా నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదని సౌమ్య వివరించారు.

మరోవైపు డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగాధిపతి మైక్ రేయాన్ మాట్లాడుతూ.. ఇది వ్యాక్సిన్ తయారీ కంపెనీలు లేదా దేశాల మధ్య పోటీ కాదని అన్నారు. ప్రజల ప్రాణాలను రక్షించుకోవడం కోసం ఇప్పుడు వైరస్‌పైనే పోటీ అని ఆయన స్పష్టం చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షల ద్వారా త్వరగా వైరస్ సోకిన వారిని గుర్తించడంతో ముప్పును చాలావరకు తగ్గించవచ్చని ఆయన సూచించారు.

Read More:

పెళ్లి పనులు.. ఆ మూవీ నుంచి తప్పుకున్న నిహారిక..!

Breaking: ఏఆర్‌ రెహమాన్‌కి మద్రాసు హైకోర్టు నోటీసులు