ఆస్తులు బారెడు.. అప్పులు మూరెడు.. మరి సూసైడెందుకు..?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కెఫే కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్యకు ముందు ఆయన రాసిన లేఖను బట్టి వ్యాపారంలో నష్టాలే ఆయన ఆత్మహత్యకు కారణమని భావించినా.. ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఆస్తులను, అప్పులను పోలుస్తున్న కొందరు సిద్ధార్థ ఆత్మహత్యకు అప్పులు కారణం కాదంటూ వాధిస్తున్నారు. కాగా కాఫీ డే గత మార్చిలో వెల్లడించిన వార్షిక నివేదిక ప్రకారం సిద్ధార్ధ పేరిటి ఉన్న అప్పులు రూ.6,500కోట్లు. […]

ఆస్తులు బారెడు.. అప్పులు మూరెడు.. మరి సూసైడెందుకు..?
Follow us

| Edited By:

Updated on: Aug 01, 2019 | 11:31 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కెఫే కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్యకు ముందు ఆయన రాసిన లేఖను బట్టి వ్యాపారంలో నష్టాలే ఆయన ఆత్మహత్యకు కారణమని భావించినా.. ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఆస్తులను, అప్పులను పోలుస్తున్న కొందరు సిద్ధార్థ ఆత్మహత్యకు అప్పులు కారణం కాదంటూ వాధిస్తున్నారు.

కాగా కాఫీ డే గత మార్చిలో వెల్లడించిన వార్షిక నివేదిక ప్రకారం సిద్ధార్ధ పేరిటి ఉన్న అప్పులు రూ.6,500కోట్లు. అయితే ఆయనకు చెందిన ఐటీ కంపెనీ మైండ్ ట్రీ షేర్లను కూడా విక్రయించి రూ.3వేల కోట్లు తీర్చారు. ఇక మిగిలింది మరో రూ.3వేలు. ప్రస్తుతం సిద్ధార్థ ఆస్తులు రూ.8,600కోట్లు(కొన్ని రిపోర్ట్స్ రూ.9,409కోట్లుగా చెప్తున్నాయి). అంటే ఆయన అప్పులు తీర్చినా ఇంకా రూ.5వేల కోట్లు ఆస్తులుంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ఏదో బలమైన కారణం ఉంటుందని అంటున్నారు. ఈ విషయాన్ని పలువురు రాజకీయ, వ్యాపార నాయకులు కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఆయనకు ఉన్న సేవాభావమే సిద్ధార్థ కంపెనీలను నష్టాల బాట పట్టించినట్లు కూడా తెలుస్తోంది.

అయితే 2017లో అతడిపై ఐటీ దాడులు జరిగిన తరువాత అప్పులు పెరిగినట్లు తెలుస్తోంది. ఆయనకు చెందిన కెఫే కాఫీ డే బ్రాండ్ వాల్యూ రూ.20వేల కోట్లు విలువ చేస్తున్నప్పటికీ. దాడుల తరువాత 46శాతం అప్పులు పెరిగాయి. ఆ అప్పులను తీర్చేందుకు ఆయన 2018లో మూడు సార్లు, 2019లో రెండు సార్లు కాఫీ డే షేర్లను తనఖా కూడా పెట్టారు. అంతేకాదు తన ఐటీ కంపెనీ మైండ్ ట్రీని కూడా అమ్మేశారు. ఈ క్రమంలో ఓ వైపు అప్పులు, మరోవైపు ఒత్తిడి తట్టుకోలేక సిద్ధార్థ చనిపోవడానికి నిర్ణయించుకున్నాడని సమాచారం.