కాపాడిన వారిపైనే తిరగబడిన గజరాజు.. వీడియో వైరల్!

అసోంలో ఓ ఏనుగును కాపాడేందుకు ప్రయత్నించిన గ్రామస్తులు చిక్కుల్లో పడ్డారు. మోరిగాన్ అటవీ ప్రాంతంలో రెండు బండరాళ్ల మధ్యలో ఓ ఏనుగు చిక్కుకుపోయింది. దాని అవస్థ, అర్తనాదాలు చూడలేకపోయిన సమీపంలోని గ్రామస్తులు దాన్ని తాళ్ల సాయంతో బయటకు తీశారు. బండరాళ్ల మధ్య నుంచి బయటపడ్డ ఆ ఏనుగు గ్రామస్తుల వెంటపడింది. ఏనుగుకి చిక్కకుండా ఉండేందుకు స్థానికులతో పాటు ఫారెస్ట్ సిబ్బంది పరుగులు తీశారు. అయినప్పటికి గజరాజు విడిచిపెట్టకపోవడంతో ఫారెస్ట్‌ సిబ్బంది తుఫాకితో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ […]

కాపాడిన వారిపైనే తిరగబడిన గజరాజు.. వీడియో వైరల్!

అసోంలో ఓ ఏనుగును కాపాడేందుకు ప్రయత్నించిన గ్రామస్తులు చిక్కుల్లో పడ్డారు. మోరిగాన్ అటవీ ప్రాంతంలో రెండు బండరాళ్ల మధ్యలో ఓ ఏనుగు చిక్కుకుపోయింది. దాని అవస్థ, అర్తనాదాలు చూడలేకపోయిన సమీపంలోని గ్రామస్తులు దాన్ని తాళ్ల సాయంతో బయటకు తీశారు. బండరాళ్ల మధ్య నుంచి బయటపడ్డ ఆ ఏనుగు గ్రామస్తుల వెంటపడింది. ఏనుగుకి చిక్కకుండా ఉండేందుకు స్థానికులతో పాటు ఫారెస్ట్ సిబ్బంది పరుగులు తీశారు. అయినప్పటికి గజరాజు విడిచిపెట్టకపోవడంతో ఫారెస్ట్‌ సిబ్బంది తుఫాకితో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఏనుగు దాడిలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. అతడ్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Published On - 8:07 pm, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu