భార్య వదిలేసి వెళ్లింది.. ఒంటరి పురుషుడి కోటాలో పింఛన్ ఇవ్వండి

తెలంగాణలో అర్హులైన మహిళలకు ఆసరా పెన్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. వివిధ కారణాల వల్ల భర్తలకు దూరమైన మహిళలకు, వితంతువులకు, దివ్యాంగులైన బీడీ కార్మికులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు.. ఆర్థిక తోడ్పాటు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే తరహాలో ఇప్పుడు ఓ వ్యక్తి తనకు ఒంటరి పురుషుడి ఖాతాలో పెన్షన్ ఇవ్వమని అర్జీ పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.  ఈ ఆసక్తికర ఘటన కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. భార్య..తొమ్మిదేళ్ల క్రితమే వదిలేసి […]

  • Ram Naramaneni
  • Publish Date - 8:19 pm, Tue, 12 November 19
భార్య వదిలేసి వెళ్లింది.. ఒంటరి పురుషుడి కోటాలో పింఛన్ ఇవ్వండి

తెలంగాణలో అర్హులైన మహిళలకు ఆసరా పెన్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. వివిధ కారణాల వల్ల భర్తలకు దూరమైన మహిళలకు, వితంతువులకు, దివ్యాంగులైన బీడీ కార్మికులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు.. ఆర్థిక తోడ్పాటు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే తరహాలో ఇప్పుడు ఓ వ్యక్తి తనకు ఒంటరి పురుషుడి ఖాతాలో పెన్షన్ ఇవ్వమని అర్జీ పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.  ఈ ఆసక్తికర ఘటన కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. భార్య..తొమ్మిదేళ్ల క్రితమే వదిలేసి వెళ్లిందని..తల్లీదండ్రులకు వృద్ధాప్యం మీదపడటంతో సాకలేకపోతున్నానని..కూలిపనుల చేయగా వచ్చిన డబ్బులు ఏ మాత్రం సరిపోవడంలేదని అతడు సర్పంచ్‌కు మొరపెట్టుకున్నాడు.

అసిఫాబాద్‌ జిల్లా బూరుగూడకి చెందిన ధరణి తిరుపతి తన తల్లిదండ్రులతో కలిసి గ్రామంలో జీవనం సాగిస్తున్నాడు. తన స్థిర, చరాస్థులు ఏమి లేవని.. ఒంటరి మహిళలకు నెల.. నెలా రూ.2016 ఆసరా పింఛన్ అందించినట్లే.. ఒంటరి పురుషుడినైన తన దయనీయ స్థితిని గమనించి..  పింఛన్ అందించాలని కోరుతున్నాడు. మరి ఈ అర్జీపై సర్పంచ్, అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.