ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు భద్రత కుదింపు ? నలుగురు కమెండోల తొలగింపు !

ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు భద్రతను కేంద్రం కుదించినట్టు తెలుస్తోంది. ఆరుగురు కమెండోలలో నలుగురిని తొలగించినట్టు..

  • Umakanth Rao
  • Publish Date - 8:31 pm, Thu, 25 February 21
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు భద్రత కుదింపు ? నలుగురు కమెండోల తొలగింపు !
Arvind Kejriwal

ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు భద్రతను కేంద్రం కుదించినట్టు తెలుస్తోంది. ఆరుగురు కమెండోలలో నలుగురిని తొలగించినట్టు సమాచారం.. ఇటీవలి గుజరాత్ స్థానిక ఎన్నికల్లో ఆప్ సక్సెస్ సాధించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. తాను ఈ నెల 26 న గుజరాత్ ను సందర్శిస్తానని కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించారు. ఇలా ఉండగా ఆయనకు తాము భద్రతను కుదించినట్టు వచ్సిన వార్తలను హోమ్ శాఖ అధికారులు తోసిపుచ్చ్చారు. కానీ ఆప్ వర్గాలు సూచనప్రాయంగా ఈ విషయాన్నీ వెల్లడించాయి. కాగా- సూరత్  ప్రజలు 125 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని ఓడించారని, అక్కడ తమపార్టీని ప్రధాన విపక్షంగా చేశారని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఇది కొత్త రాజకీయాలకు నాంది అన్నారు. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆప్ 27 సీట్లను గెలుచుకుంది. అటు గోవా, జమ్మూ కాశ్మీర్ స్థానిక ఎన్నికల్లోనూ తన ఉనికిని చాటుకుంది.

ఇలా ఉండగా పంజాబ్ స్థానిక ఎన్నికల్లో మాత్రం తమ పార్టీ ఓటమిని ఆప్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అక్కడ కాంగ్రెస్  ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించింది. రైతుల నిరసనకు తాము ఎంతగా మద్దతు ప్రకటించినా ఆ రాష్ట్రంలో తమ పార్టీకి శృంగభంగమైందని  వారు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

Andhrapradesh: భార్యకు ప్రేమతో.. నిలువెత్తు చెక్క విగ్రహం.. వేదమంత్రాల సాక్షిగా ఇంట్లో ప్రతిష్ట

India Win: ఐదు రోజుల టెస్టు రెండ్రోజులకే సరి.. మోతెరా పిచ్‌లో తిప్పేసిన స్పిన్నర్లు.. భారత్ ఘన విజయం