మూవీ యాక్షన్‌ని తలపించేలా.. బైక్ పై సీఎం ఒంటరి ప్రయాణం..!

అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండూ అందరిని ఆశ్యర్య పరిచేలా చేశారు. ఆ రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి అభివృద్ధి దిశగా నడిపించేందుకు స్వయంగా ఆయనే బైక్ పై ఒంటరిగా 122 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. దీనికి సంబంధించి.. తన అనుభూతిని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని పాసిఘాట్ ప్రాంతం బైక్ రైడింగ్, సాహస క్రీడలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతానికి పర్యాటకుల్ని ఆకర్షించి ప్రోత్సహించేంకుందు ఆయనే స్వయంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 బైక్ పై పర్యటనకు […]

  • Publish Date - 11:02 am, Wed, 16 October 19 Edited By:
మూవీ యాక్షన్‌ని తలపించేలా.. బైక్ పై సీఎం ఒంటరి ప్రయాణం..!

అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండూ అందరిని ఆశ్యర్య పరిచేలా చేశారు. ఆ రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి అభివృద్ధి దిశగా నడిపించేందుకు స్వయంగా ఆయనే బైక్ పై ఒంటరిగా 122 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. దీనికి సంబంధించి.. తన అనుభూతిని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని పాసిఘాట్ ప్రాంతం బైక్ రైడింగ్, సాహస క్రీడలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతానికి పర్యాటకుల్ని ఆకర్షించి ప్రోత్సహించేంకుందు ఆయనే స్వయంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 బైక్ పై పర్యటనకు వెళ్లారు. యుంకియాంగ్ నుంచి పాసిఘాట్ వరకు సీఎం ఒక్కరే బైక్ పై ప్రయాణించారు. తన రైడ్‌కు సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ.. పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రయాణం అని పేర్కొన్నారు. కాగా పెమాఖండూ ఇలాంటి సాహసాలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఆయన చాలా సార్లు బైక్ రైడ్ చేస్తూ కనిపించారు. గతేడాది బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌లో పాటు సైకిల్ తొక్కిన విషయం తెలిసిందే. పర్యాటకాన్ని ప్రోత్సహించే సన్నివేశాలను పెమాఖండూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు.