కాశ్మీరీలకు 370 అధికరణం రద్దు వరమే , నేతలు ఆలోచించాలి, సూఫీ స్కాలర్ సూచన

ఈ లోయ ఎన్నో ప్రకృతి అందాలతో కూడినదైనా ఇక్కడి ఆరోగ్య  పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. సరైన ఆసుపత్రులు, మెడికల్ సౌకర్యాలు లేవు, పేదలకు  ఉచిత వైద్యం ప్రసక్తే లేదు..

కాశ్మీరీలకు 370 అధికరణం రద్దు వరమే , నేతలు ఆలోచించాలి, సూఫీ స్కాలర్ సూచన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 16, 2020 | 4:20 PM

కాశ్మీర్ కు సంబంధించి 370, 35 ఎ అధికరణాలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదేనని సూఫీ స్కాలర్ ఒకరు అన్నారు. ఈ ఆర్టికల్స్ ఇండియాలో ఈ ప్రాంత సమగ్రతకు అవరోధాలని వారు గుర్తించాలని ముఫ్టీ మంజూర్ అనే ఈ స్కాలర్  కోరారు. దివంగత మాజీ ప్రధాని వాజ్ పేయి కాశ్మీరీయత్ కు, ఇన్సాని యత్ కు, హిందుస్తానియత్ కు ‘హీలింగ్ టచ్; ఎలా ఇచ్చారో ఈ ప్రభుత్వాలు గమనించాలని ఆయన సూచించారు. దశాబ్దాల క్రితం కాశ్మీర్ ను వదిలివెళ్లిన పండిట్లను తిరిగి ఈ లోయకు రప్పించాలని, వారికి పునరావాసం కల్పించాలని అన్నారు. అలాగే ఇక్కడ తమ భర్తలకు, సోదరులకు దూరమైన మహిళలను, వితంతువులను  కూడా ప్రభుత్వాలు ఆదుకోవాలని, వారి కాళ్ళపైన వారు నిలబడేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ లోయ ఎన్నో ప్రకృతి అందాలతో కూడినదైనా ఇక్కడి ఆరోగ్య  పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. సరైన ఆసుపత్రులు, మెడికల్ సౌకర్యాలు లేవు, పేదలకు  ఉచిత వైద్యం ప్రసక్తే లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థపరులు, అవినీతిపరులైన నాయకుల కారణంగా ఈ లోయ ఇంకా అభివృధ్దికి ఆమడ దూరంలోనే ఉందని ముఫ్టీ మంజూర్ పేర్కొన్నారు. తాను ఎన్నోసార్లు కశ్మీర్ ను విజిట్ చేశానని, కానీ ఇక్కడి పరిస్థితులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందాన ఉన్నాయన్నారు. అవినీతిపరులైన నేతలు దశాబ్దాల తరబడి చేసిన పాపాలకు ఇక్కడి అమాయక ప్రజలు అల్లాడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం  చేశారు. జమ్మూ కాశ్మీర్, పీ ఓ కె, గిల్గిట్, బల్టిస్థాన్ భారత దేశ అంతర్భాగాలే ! వీటిపై మన దేశానికి గల హక్కులను ఏ విదేశీ శక్తులూ ప్రశ్నించజాలవు అన్నారాయన.

జమ్మూ కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని కేంద్రం రద్దు చేయడాన్ని నిరసిస్తూ నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీల నేతలు ఆందోళనకు సిధ్ధపడుతున్న తరుణంలో ఈ సూఫీ స్కాలర్ వెలిబుచ్చిన అభిప్రాయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.