అరెస్టు చేస్తారా ? దమ్ముంటే చెయ్యండి ! నితీష్ కుమార్ ప్రభుత్వానికి తేజస్వి యాదవ్ సవాల్

రైతు చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న అన్నదాతలకు మద్దతు ప్రకటించినందుకు తనను అరెస్టు చేస్తారా అని బీహార్ విపక్ష నేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వానికి సవాల్..

అరెస్టు చేస్తారా ?  దమ్ముంటే చెయ్యండి ! నితీష్ కుమార్ ప్రభుత్వానికి తేజస్వి యాదవ్ సవాల్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 06, 2020 | 2:58 PM

రైతు చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న అన్నదాతలకు మద్దతు ప్రకటించినందుకు తనను అరెస్టు చేస్తారా అని బీహార్ విపక్ష నేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.  మహా ఘట్ బంధన్ కూటమిలో..  తేజస్వి సహా 18 మంది  నేతలు, కార్యకర్తలు….. రైతుల ఆందోళనను  సమర్థిస్తూ నిరసన ప్రదర్శనకు దిగారు. అయితే వీరు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో వీరిపై ఖాకీలు కేసు పెట్టారు.  కరోనా వైరస్ ప్రబలిన ఈ తరుణంలో వీరంతా ఇలా ప్రొటెస్ట్ చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నితీష్ కుమార్ ని తేజస్వి పిరికి వ్యక్తిగా అభివర్ణించారు. దమ్ముంటే మమ్మల్నందరినీ అరెస్టు చెయ్యండి  చూద్దాం అన్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్ లో నిన్న వీరు నిర్వహించిన ప్రదర్శనకు వివిధ పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయితే పాలక జేడీ-ఎస్, బీజేపీ కూటమి ప్రభుత్వం..వీరి అరెస్టుకు ఆదేశాలిచ్చింది.

దేశ వ్యాప్త రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తామంటూ వీరంతా ప్రమాణం చేశారు. ఈ నెల 8 న అన్నదాతలు తలపెట్టిన భారత్ బంద్ కు మహాఘట్ బంధన్ పూర్తి సపోర్ట్ ప్రకటించింది. వివాదాస్పదమైన రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో తమ నిరసనను ఉధృతం చేస్తామని ఈ కూటమి ప్రకటించింది.

7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..
72 బంతుల్లో 169 రన్స్.. ఆర్సీబీకి విలన్‌గా మారిన మాజీ ప్లేయర్లు
72 బంతుల్లో 169 రన్స్.. ఆర్సీబీకి విలన్‌గా మారిన మాజీ ప్లేయర్లు
ఘోర రోడ్డు ప్రమాదం.. వంతెనపై నుంచి పడిపోయిన బస్సు! ఐదుగురు మృతి
ఘోర రోడ్డు ప్రమాదం.. వంతెనపై నుంచి పడిపోయిన బస్సు! ఐదుగురు మృతి
పర్సనల్ లోన్ విషయంలో తాకట్టు..కనికట్టు
పర్సనల్ లోన్ విషయంలో తాకట్టు..కనికట్టు
36 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. 20 రోజుల్లోనే బ్రేక్
36 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. 20 రోజుల్లోనే బ్రేక్
బుల్లెట్‌ ఫ్రూవ్‌ కారు కొనాలంటే ఇంత కష్టమా..?తయారీకి ముందే ఇవన్ని
బుల్లెట్‌ ఫ్రూవ్‌ కారు కొనాలంటే ఇంత కష్టమా..?తయారీకి ముందే ఇవన్ని