లాక్‌డౌన్ సమయంలో చెక్‌పోస్టుల వద్ద గంజాయి స్మగ్లర్లతో స్నేహం, ఆపై ఏఆర్ కానిస్టేబుల్ ఏం చేశాడంటే

కొందరు పోలీసులు దారి తప్పుతున్నారు. న్యాయానికి మద్దతుగా ఉండాల్సింది పోయి..అక్రమాలకు పాల్పడుతూ డిపార్ట్‌మెంట్ పరువు తీస్తున్నారు.

లాక్‌డౌన్ సమయంలో చెక్‌పోస్టుల వద్ద గంజాయి స్మగ్లర్లతో స్నేహం, ఆపై ఏఆర్ కానిస్టేబుల్ ఏం చేశాడంటే
Ram Naramaneni

|

Dec 13, 2020 | 4:48 PM

కొందరు పోలీసులు దారి తప్పుతున్నారు. న్యాయానికి మద్దతుగా ఉండాల్సింది పోయి..అక్రమాలకు పాల్పడుతూ డిపార్ట్‌మెంట్ పరువు తీస్తున్నారు. తాజాగా ఓ ఏఆర్‌ కానిస్టేబుల్ గంజాయి అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే…అనంత నగరం నీరుగంటి వీధికి చెందిన జె.మోహనకృష్ణ ఏఆర్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో నేషనల్ హైవేల మీద చెక్‌పోస్టుల వద్ద పని చేశాడు. ఇదే సమయంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న పలువురు స్మగ్లర్లతో అతడికి పరిచయం ఏర్పడింది. వారికి సహాయ సహకారాలు అందిస్తూ దందాలో భాగమయ్యాడు.

విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి గంజాయి తెచ్చి  జహీరాబాద్‌, బళ్లారి తదితర ప్రాంతాలకు ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నాడు. శుక్రవారం కారులో మోహనకృష్ణ హైదరాబాద్‌కు గంజాయి తీసుకొస్తున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. జనగాం వెళ్లి అక్కడ నారగాని సమ్మయ్యను, మాసన్‌పల్లికి చెందిన బొంత యాదగిరిని కారులో ఎక్కించుకొని సిటీకి వస్తుననాడు వస్తున్నాడు. ఉప్పల్‌ నల్లచెరువు వద్ద పోలీసులు నిఘా పెట్టి కారు చెక్ చేయగా అందులో గంజాయి ప్యాకెట్లు దొరికాయి. బొంత యాదగిరి, దొంత రాజుకు సిటీలో గంజాయిని ఇచ్చేందుకు వచ్చాడు. బొంత రాజు పరారీలో ఉండగా మిగతా ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి రూ.16 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Also Read :

Bigg Boss Telugu 4 : మనసులోని భావాలను బయటపెట్టిన అభిజిత్..ఈ విషయం అస్సలు ఊహించి ఉండరు

Bigg Boss Telugu 4 : మరోసారి వివాదం రేపిన రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్..సోహైల్‌పై షాకింగ్ కామెంట్స్

కొండంత ట్రాఫిక్..శ్రీశైలంలో పద్మవ్యూహంలో చిక్కుకున్న భక్తులు..5 కిలోమీటర్ల మేర జామ్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu