తిరుపతి టికెట్ల వ్యవహారంలో కొత్త ట్విస్ట్.. ఏపీఎస్ ఆర్టీసీ ఈడీ వివరణ

తిరుపతిలో ఏపీఎస్ ఆర్టీఎసీ టికెట్లపై ఓ మతానికి చెందిన ప్రకటనలు ఉండటం ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. దీనిపై అటు ప్రతిపక్ష టీడీపీ, బీజేపీలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దీనిపై పూర్తిస్ధాయి విచారణ చేపడతామని దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి ప్రకటించారు. మరోవైపు ఈ వివాదంలో కొత్త ట్విస్ట్ బయటపడింది. తిరుపతికి చెందిన బస్ టికెట్ల వెనుక అన్యమతానికి చెందిన ప్రకటనలు ఇప్పుడు ముద్రించినవి కాదని అవి టీడీపీ హాయంలోనే ముద్రించినట్టు స్వయంగా ఏపీఎస్‌ఆర్టీసీ ఈడీ కోటేశ్వర్‌ రావు […]

తిరుపతి టికెట్ల వ్యవహారంలో కొత్త ట్విస్ట్.. ఏపీఎస్ ఆర్టీసీ ఈడీ వివరణ
Follow us

| Edited By:

Updated on: Aug 23, 2019 | 11:44 PM

తిరుపతిలో ఏపీఎస్ ఆర్టీఎసీ టికెట్లపై ఓ మతానికి చెందిన ప్రకటనలు ఉండటం ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. దీనిపై అటు ప్రతిపక్ష టీడీపీ, బీజేపీలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దీనిపై పూర్తిస్ధాయి విచారణ చేపడతామని దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి ప్రకటించారు. మరోవైపు ఈ వివాదంలో కొత్త ట్విస్ట్ బయటపడింది.

తిరుపతికి చెందిన బస్ టికెట్ల వెనుక అన్యమతానికి చెందిన ప్రకటనలు ఇప్పుడు ముద్రించినవి కాదని అవి టీడీపీ హాయంలోనే ముద్రించినట్టు స్వయంగా ఏపీఎస్‌ఆర్టీసీ ఈడీ కోటేశ్వర్‌ రావు వివరణనిచ్చారు. గత మార్చిలో మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 18 ప్రకటనలను రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో టిక్కెట్ల వెనుక ముద్రించారని, అందులో కొన్ని రోల్స్‌ తిరుపతి డిపోకు వచ్చాయన్నారు. గత మూడేళ్లుగా ఆర్టీసీలో ప్రకటనల బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించామని దీంతో ఈ ప్రకటనలు ముద్రించినట్టు చెప్పారు. ఈ టికెట్లు అనుకోకుండా వచ్చినట్టు చెప్పారు కోటేశ్వర్‌రావు తెలిపారు. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.