సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన యాపిల్ ధరలు..

లాక్‌డౌన్‌ కారణంగా యాపిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. గతంలో ఒక్కో యాపిల్ బాక్స్ రూ. 1500 నుంచి రూ. 1800 వరకు ఉండగా.. ఇప్పుడు దిగుమతి తగ్గడంతో..

సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన యాపిల్ ధరలు..
Ravi Kiran

|

Sep 06, 2020 | 2:02 PM

లాక్‌డౌన్‌ కారణంగా యాపిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. గతంలో ఒక్కో యాపిల్ బాక్స్ రూ. 1500 నుంచి రూ. 1800 వరకు ఉండగా.. ఇప్పుడు దిగుమతి తగ్గడంతో సామాన్యునికి షాకిస్తూ వాటి రేట్లు అమాంతం పెరిగాయి. తాజాగా ఒక్కో బాక్స్ యాపిల్స్ రూ. 2000 నుంచి రూ. 3500 వరకు పలుకుతున్నాయి. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రోజుకు కేవలం 200 బాక్స్ లు మాత్రమే అమ్ముడవుతున్నాయని విక్రయదారులు వాపోతున్నారు. కానీ కరోనాకి ముందు మాత్రం 500 – 1000 బాక్స్‌లు అమ్ముడు పోయావని చెప్పుకొచ్చారు. (Apple Prices Hiked)

కాగా, యాపిల్ బాటలోనే పైనపిల్ ధరలు కూడా మండుతున్నాయి. కరోనాకి ముందు ఒక్క పైనపిల్ ధర రూ. 20 నుంచి రూ. 25 ఉండగా.. ఇప్పుడు మాత్రం రూ. 50- రూ. 55 వరకు పెరిగింది. అటు పైనాపిల్‌తో పాటు బత్తాయిలో ‘సి’ విటమిన్ ఎక్కువగా ఉండటంతో వాటి అమ్మకాలు కూడా బాగా పెరిగాయి. (Sleep Internship Job In Bangalore)

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu