రోజా వర్కవుట్స్.. వ్యాయామం చేయాలంటూ యువతకు సందేశం..

ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా ఏది చేసినా అది ఒక సంచలనమే. తాజాగా ఆమె చిత్తూరు జిల్లా పుత్తూరులోని ప్రభుత్వ కాలేజీ ఆవరణలో పురపాలక సంఘం ఏర్పాటు చేసిన పబ్లిక్ జిమ్‌ను ప్రారంభించారు. పబ్లిక్ జిమ్‌లోని పలు సాధనాలతో కాసేపు వర్కవుట్స్‌ చేసిన రోజా.. క్రమం తప్పకుండా జిమ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పారు. ప్రజలంతా ఈ ఓపెన్ జిమ్‌ను ఉపయోగించుకుని.. వ్యాయామాలు చేస్తుండాలని సూచించారు. దీంతో పాటు నగరి మున్సిపాలిటీ పరిధిలోని కాకవేడులో […]

రోజా వర్కవుట్స్.. వ్యాయామం చేయాలంటూ యువతకు సందేశం..
Ravi Kiran

|

Oct 02, 2019 | 8:35 PM

ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా ఏది చేసినా అది ఒక సంచలనమే. తాజాగా ఆమె చిత్తూరు జిల్లా పుత్తూరులోని ప్రభుత్వ కాలేజీ ఆవరణలో పురపాలక సంఘం ఏర్పాటు చేసిన పబ్లిక్ జిమ్‌ను ప్రారంభించారు. పబ్లిక్ జిమ్‌లోని పలు సాధనాలతో కాసేపు వర్కవుట్స్‌ చేసిన రోజా.. క్రమం తప్పకుండా జిమ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పారు. ప్రజలంతా ఈ ఓపెన్ జిమ్‌ను ఉపయోగించుకుని.. వ్యాయామాలు చేస్తుండాలని సూచించారు.

దీంతో పాటు నగరి మున్సిపాలిటీ పరిధిలోని కాకవేడులో ఉన్న గ్రామ సచివాలయ నూతన భవనంను కూడా ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోజుతో పాటు పురపాలక సంఘం అధికారులు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu