ఏపీలో పారదర్శకంగా ఎన్నికలు..ద్వివేదికి అవార్డు..

2019 సార్వత్రిక ఎన్నికలకు అవార్డులను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. గత ఏడాది ఎలక్షన్స్‌ను పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించినందుకు ఏపీ స్టేట్ ‘ఉత్తమ ఎన్నికల నిర్వహణ’ అవార్డుకు ఎంపికైంది. ఇక ఉత్తమ ఎలక్షన్ ఆఫీసర్‌గా మాజీ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది ఘనత సొంతం చేసుకున్నారు. గత ఎన్నికల సమయంలో రిగ్గింగ్ లేదా అవకతవకలు జరగలేదు. సంఘ విద్రోహ కార్యకలాపాల్లో కూడా తగ్గుదల కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో 2019 సార్వత్రిక ఎన్నికలు శాంతియుత వాతావరణంలో ముగిశాయి. దీనిపై ఆంధ్రప్రదేశ్ […]

ఏపీలో పారదర్శకంగా ఎన్నికలు..ద్వివేదికి అవార్డు..
Ram Naramaneni

|

Jan 23, 2020 | 9:09 PM

2019 సార్వత్రిక ఎన్నికలకు అవార్డులను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. గత ఏడాది ఎలక్షన్స్‌ను పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించినందుకు ఏపీ స్టేట్ ‘ఉత్తమ ఎన్నికల నిర్వహణ’ అవార్డుకు ఎంపికైంది. ఇక ఉత్తమ ఎలక్షన్ ఆఫీసర్‌గా మాజీ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది ఘనత సొంతం చేసుకున్నారు. గత ఎన్నికల సమయంలో రిగ్గింగ్ లేదా అవకతవకలు జరగలేదు. సంఘ విద్రోహ కార్యకలాపాల్లో కూడా తగ్గుదల కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో 2019 సార్వత్రిక ఎన్నికలు శాంతియుత వాతావరణంలో ముగిశాయి. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది ఉత్తమ సీఈఓ అవార్డుగా ప్రకటించారు. ఈ అవార్డులను అందుకోడానికి గోపాలకృష్ణ ద్వివేది గురువారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరారు. 

ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ద్వివేదికి సత్కారంతో పాటు లక్ష రూపాయల నగదు బహుమతిని సైతం అందించనున్నారు. ఏపీతో పాటు పంజాబ్, ఒరిస్సా రాష్ట్రాలు సైతం ఎలక్షన్స్ మేనేజ్‌మెంట్‌లో సత్తా చాటాయి. దీంతో ఆయా రాష్ట్రాలు కూడా అవార్డులు అందుకోనున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ అంశాల్లో మొత్తం 20 అవార్డులను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu