జనవరి నెలాఖరు కల్లా పెన్నా బ్యారేజీని ప్రారంభిస్తాం: ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్

నెల్లూరు పెన్నా బ్యారేజీ పనుల్ని ఏపీ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ ఇవాళ పరిశీలించారు. జనవరి నెలాఖరు నాటికి పెన్నా బ్యారేజీని ప్రారంభిస్తామని మంత్రి అనిల్‌ ఈ సందర్భంగా చెప్పారు. మరో నెలలో సంగం బ్యారేజీని కూడా పూర్తిచేస్తామన్నారు. నెల్లూరు జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలోనే మరిన్ని బృహత్తర కార్యక్రమాలు చేపడతామని మంత్రి తెలిపారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి విషయంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు స్పందించిన మంత్రి.. పార్టీ అభ్యర్థిగా ఎవరిని పెట్టాలో అన్నది పార్టీ […]

జనవరి నెలాఖరు కల్లా పెన్నా బ్యారేజీని ప్రారంభిస్తాం: ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్

నెల్లూరు పెన్నా బ్యారేజీ పనుల్ని ఏపీ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ ఇవాళ పరిశీలించారు. జనవరి నెలాఖరు నాటికి పెన్నా బ్యారేజీని ప్రారంభిస్తామని మంత్రి అనిల్‌ ఈ సందర్భంగా చెప్పారు. మరో నెలలో సంగం బ్యారేజీని కూడా పూర్తిచేస్తామన్నారు. నెల్లూరు జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలోనే మరిన్ని బృహత్తర కార్యక్రమాలు చేపడతామని మంత్రి తెలిపారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి విషయంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు స్పందించిన మంత్రి.. పార్టీ అభ్యర్థిగా ఎవరిని పెట్టాలో అన్నది పార్టీ అంతర్గత విషయమని.. ఈ అంశంపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.