AP Local Body Elections Live Updates: ఏపీలో మోగిన స్థానిక సంస్థల ఎన్నికల నగారా.. కొత్త పంచాయితీకి తెరలేపేనా.!

| Edited By: Anil kumar poka

Updated on: Jan 09, 2021 | 12:22 PM

AP Local Body Elections: ఎట్టకేలకు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా ఎలక్షన్ కమిషన్..

AP Local Body Elections Live Updates: ఏపీలో మోగిన స్థానిక సంస్థల ఎన్నికల నగారా.. కొత్త పంచాయితీకి తెరలేపేనా.!

AP Local Body Elections: ఎట్టకేలకు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా ఎలక్షన్ కమిషన్ కొద్దిసేపటి క్రితమే షెడ్యూల్ విడుదల చేసింది. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్‌ను కూడా రిలీజ్‌ చేసేశారు. దీనితో ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఎస్ఈసీ తీసుకున్న ఈ నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Jan 2021 11:58 PM (IST)

    ఎస్‌ఈసీ నిర్ణయం సుప్రీం కోర్టు తీర్పు ఉల్లంఘనే

    ఎస్‌ఈసీ నిర్ణయంపై పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి జికె ద్వివేది స్పందించారు. ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఎస్‌ఈసీ నిర్ణయం సుప్రీం కోర్టు తీర్పు ఉల్లంఘనేనని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్‌ ప్రక్రియలో ఉన్నామని చెప్పినా ఎస్‌ఈసీ మొండిగా వెళ్లింది. గత ఏడాది మార్చి 15న ఒకే కరోనా కేసున్నా ఏకపక్షంగా వాయిదా వేశారని అన్నారు.

  • 08 Jan 2021 11:35 PM (IST)

    ఎన్నికలపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్‌

    ఎన్నికల నిర్వహణపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పందించారు. ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. చంద్రబాబు ప్రయోజనాలా, ఏపీ ప్రయోజనాలా నిమ్మగడ్డ చెప్పాలి అని అన్నారు. 26 కేసులు వచ్చినప్పుడు వాయిదా వేసిన నిమ్మగడ్డ ఇప్పుడెలా పెడతారు. ఎన్నికల షెడ్యూల్‌పై మా పార్టీ శనివారం అధికారికంగా స్పందిస్తుంది. నోటిఫికేషన్‌ ఇవ్వడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడమేనని మల్లాది విష్ణు అన్నారు.

  • 08 Jan 2021 11:13 PM (IST)

    నాలుగో దశ షెడ్యూల్‌

    ఫిబ్రవరి 4న నోటిఫికేషన్‌ జారీ, ఫిబ్రవరి 6న నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 8న నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ, ఫిబ్రవరి 9న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 12న నామినేషన్ల ఉపసంహరణ, ఫిబ్రవరి 17న ఎన్నికల పోలింగ్‌. పోలింగ్‌ జరిగిన రోజే ఓట్ల లెక్కింపు జరగనుంది.

  • 08 Jan 2021 11:12 PM (IST)

    మూడో దశ షెడ్యూల్‌

    జనవరి 31న నోటిఫికేషన్‌ జారీ, ఫిబ్రవరి 2న నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 4న నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ, ఫిబ్రవరి 5న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 8న నామినేషన్ల ఉపసంహరణ, ఫిబ్రవరి 13న ఎన్నికల పోలింగ్‌.

  • 08 Jan 2021 11:11 PM (IST)

    రెండో దశ షెడ్యూల్‌

    జనవరి 27న నోటిఫికేషన్‌ జారీ, జనవరి 29న నామినేషన్ల స్వీకరణ, జనవరి 31న నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ, ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 4న నామినేషన్ల ఉపసంహరణ, ఫిబ్రవరి 9న ఎన్నికల పోలింగ్‌.

  • 08 Jan 2021 11:10 PM (IST)

    తొలి దశ షెడ్యూల్‌

    ఏపీ పంచాయతీ ఎన్నికలకు జనవరి 23న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. 25న నామినేషన్ల స్వీకరణ, 27న నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ, 28న నామినేషన్ల పరిశీలన, 31న నామినేషన్ల ఉప సంహరణ, ఫిబ్రవరి 5న ఎన్నికల పోలింగ్‌ .

  • 08 Jan 2021 10:23 PM (IST)

    ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఇలా ఉంది.. రేపటి నుంచి ఎన్నికల కోడ్ అమలు..

    ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఇలా ఉంది. తొలి దశ ఎన్నికలకు జనవరి 23న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.. ఫిబ్రవరి 2న ఎన్నికలను నిర్వహించనున్నారు. రెండో దశ ఎన్నికలకు జనవరి 27న నోటిఫికేషన్‌ రానుండగా.. ఎన్నికలు ఫిబ్రవరి 9న జరగనున్నాయి. మూడోదశ ఎన్నికలకు జనవరి 31న నోటిఫికేషన్ ఇచ్చి.. ఫిబ్రవరి 13న పోలింగ్‌ చేపట్టనున్నారు.. నాలుగోదశ ఎన్నికలకు ఫిబ్రవరి 4న నోటిఫికేషన్‌ ఇచ్చి.. ఫిబ్రవరి 17న పోలింగ్‌ నిర్వహిస్తారు.. ఎన్నికల కోడ్‌ కూడా రేపట్నుంచే అమల్లోకి రానుంది.

  • 08 Jan 2021 10:22 PM (IST)

    సీఎస్‌తో భేటి అనంతరం.. ఏపీ స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల..

    ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్‌ను  రిలీజ్‌ చేశారు.

  • 08 Jan 2021 10:21 PM (IST)

    నిమ్మగడ్డతో సీఎస్‌ భేటి వివరాలు ఇలా ఉన్నాయి..

    ఎన్నికల నిర్వహణపై ఇవాళ సాయంత్రమే SEC నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌తో ఏపీ చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్ భేటి అయిన సంగతి తెలిసిందే‌. ఈ అంశంపై గంటన్నరపాటు నిమ్మగడ్డతో చర్చించారు. స్ట్రెయిన్‌‌తో మళ్లీ ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయని వివరించారు. వ్యాక్సిన్‌ పంపిణీకి కేంద్రం ఆదేశాలు ఇవ్వడంతో సిబ్బంది అంతా ఆ బిజీలో ఉన్నారని, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కరెక్ట్‌ కాదని సూచించారు. మరోవైపు కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయన్న వివరాలను అందించారు. కాబట్టి ఫిబ్రవరిలో ఎన్నికలు జరపకుండా వాయిదా వేయాలని కోరారు.

  • 08 Jan 2021 10:21 PM (IST)

    స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు చెప్పింది ఇదే..

    ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మూడు రోజుల్లోపు ముగ్గురు ప్రిన్సిపాల్ సెక్రటరీ స్థాయి అధికారులు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కలవాలని హైకోర్టు తెలిపింది. కరోనా కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న నేపధ్యంలో.. అందుకు సంబంధించిన వివరాలను ఆయా ప్రభుత్వాధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో భేటీ అయి వివరించాలని తెలిపింది. దీనితో ఈరోజు సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు కలిసి పరిస్థితులను వివరించారు.

Published On - Jan 09,2021 6:58 AM

Follow us