మాజీ స్పీకర్ కోడెల కుమార్తెకు హైకోర్టు షాక్!

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమె కోరిన  ముందుస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. విజయలక్ష్మి నాలుగు పిటిషన్లను పెట్టుకోగా, వాటిని విచారించిన న్యాయస్థానం అన్నిటినీ కొట్టేసింది. నరసరావుపేట టౌన్ , రూరల్ పోలీస్ స్టేషన్లలో నమోదైన నాలుగు కేసులు అక్రమమమని ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కావాలంటూ విజయలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. అయితే, వాటిని కోర్టు తోసిపుచ్చింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో […]

మాజీ స్పీకర్ కోడెల కుమార్తెకు హైకోర్టు షాక్!
Follow us

|

Updated on: Jul 26, 2019 | 9:02 PM

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమె కోరిన  ముందుస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. విజయలక్ష్మి నాలుగు పిటిషన్లను పెట్టుకోగా, వాటిని విచారించిన న్యాయస్థానం అన్నిటినీ కొట్టేసింది. నరసరావుపేట టౌన్ , రూరల్ పోలీస్ స్టేషన్లలో నమోదైన నాలుగు కేసులు అక్రమమమని ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కావాలంటూ విజయలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. అయితే, వాటిని కోర్టు తోసిపుచ్చింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో స్పీకర్‌గా ఉన్న కోడెల అధికారాన్ని అడ్డు పెట్టుకుని శివప్రసాదరావు కుమార్తె, కుమారుడు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, ‘కే టాక్స్’ పేరుతో దందాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఎన్నికలు అనంతరం ప్రభుత్వం మారాక  కోడెల కుటుంబంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కాగా ఇప్పటికే కోడెల ఫ్యామిలీపై 15 వరకు కేసులు నమోదయ్యాయి.