ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణయం..ఎన్నిక‌ల కమిష‌న‌ర్ కు ఉద్వాస‌న‌

ఏపీ సర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగిస్తూ జీవో జారీ చేసింది. ఆర్డినెన్స్ స‌వ‌ర‌ణ ద్వారా రమేశ్ కుమార్ కు ఉద్వాస‌న ప‌లికింది ప్ర‌భుత్వం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యూలేష‌న్స్ మారుస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన స‌ర్కార్.. దాన్ని గవర్నర్‌కు పంపగా.. వెంటనే ఆయన నుంచి గ్రీన్ సిగ్న‌ల్ లభించింది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం.. వెంటనే ఆర్డినెన్స్‌పై జీవో జారీ చేసి ఎన్నికల కమిషనర్ […]

ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణయం..ఎన్నిక‌ల కమిష‌న‌ర్ కు ఉద్వాస‌న‌
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 10, 2020 | 6:25 PM

ఏపీ సర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగిస్తూ జీవో జారీ చేసింది. ఆర్డినెన్స్ స‌వ‌ర‌ణ ద్వారా రమేశ్ కుమార్ కు ఉద్వాస‌న ప‌లికింది ప్ర‌భుత్వం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యూలేష‌న్స్ మారుస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన స‌ర్కార్.. దాన్ని గవర్నర్‌కు పంపగా.. వెంటనే ఆయన నుంచి గ్రీన్ సిగ్న‌ల్ లభించింది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం.. వెంటనే ఆర్డినెన్స్‌పై జీవో జారీ చేసి ఎన్నికల కమిషనర్ విధుల నుంచి రమేశ్ కుమార్‌ను తప్పించింది.

తాజా ఆర్డినెన్స్ తో సంక్రమించిన ప‌వ‌ర్ తో ఎన్నికల కమిషనర్‌గా రమేశ్ కుమార్‌‌ను తొలగిస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ జీవో జారీ చేసింది. ఇందుకు సంబంధించిన మొత్తం 3 జీవోలను(ఆర్డినెన్సు జారీ చేస్తూ న్యాయ శాఖ నుంచి జీవో నెంబర్: 31,..నిమ్మగడ్డను తొలగిస్తూ పంచాయతీరాజ్& గ్రామీణాభివృద్ధి శాఖ జీవో నెంబర్: 617 , 618) ప్ర‌భుత్వం గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. కాగా ఎస్ఈసీని ఆర్డినెన్స్ ద్వారా తప్పించడం చెల్లుబాటు కాకపోవచ్చని… కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కాగా మార్చి నెలలో లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్స్ కు నోటిఫికేషన్ రాగా.. కోవిడ్-19 వ్యాప్తి మ‌రింత పెరిగే అవకాశం ఉండటంతో ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్ఈసీ రమేశ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆయ‌న వెనుక టీడీపీ ఉండి గేమ్స్ ఆడిస్తుందంటూ సీఎం స‌హా వైసీపీ నేత‌లు ఫైర‌యిన విష‌యం తెలిసిందే.