డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 11న ఖాతాల్లోకి నగదు జమ.!

డ్వాక్రా సంఘాల అక్కా చెల్లెమ్మలకు తోడ్పాటు అందించేందుకు జగన్ సర్కార్ మరో సంక్షేమ పధకానికి శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 11న ''వైఎస్సార్ ఆసరా' పధకాన్ని ప్రారంభించనున్నట్లు...

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 11న ఖాతాల్లోకి నగదు జమ.!
Follow us

|

Updated on: Sep 10, 2020 | 11:41 AM

YSR Asara Scheme: డ్వాక్రా సంఘాల అక్కా చెల్లెమ్మలకు తోడ్పాటు అందించేందుకు జగన్ సర్కార్ మరో సంక్షేమ పధకానికి శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 11న అనగా రేపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ”వైఎస్సార్ ఆసరా’ పధకాన్ని ప్రారంభించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అర్హులైన వారందరికీ ఈ పధకం ద్వారా లబ్ది చేకూరేలా చూడాలని.. అంతేకాకుండా వారి ఖాతాల్లో జమైన డబ్బును బ్యాంకులు పాత బకాయిలుగా జమ చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు.

ఇక ఈ నెల 11వ తేదీ నుంచి 17 వరకు జగన్ సర్కార్ మహిళల సంక్షేమం కోసం చేస్తున్న అన్ని కార్యక్రమాలపై అవగాహన కల్పించేలా వారోత్సవాలు నిర్వహించాలని బొత్స సత్యనారాయణ తెలిపారు. కాగా, ‘వైఎస్సార్ ఆసరా’ పధకం ద్వారా డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా రూ. 6700 కోట్ల రుణ సాయం చేయనుంది. తొలి విడతగా పట్టణ ప్రాంతాల్లోని 1.52 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ. 1,186 కోట్ల మేర లబ్ది చేకూరనుంది.

Also Read:

విశాఖను భయపెడుతున్న కొత్త వైరస్.. జనాల్లో హడల్..

‘మనసు మమత’ శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్..

తెలంగాణ సర్కార్ సంచలనం.. ఇకపై ‘లైఫ్‌టైమ్‌ క్యాస్ట్ సర్టిఫికెట్‌’..